»Hrithik Roshan Reacts As Sussanne Khan Receives Love Filled Birthday Post From Boyfriend Arslan Goni
Hrithik Roshan: మాజీ భార్యకు ప్రియుడు పంపిన విషేస్ పోస్ట్ పై హృతిక్ రోషన్ రియాక్ట్
హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్ తన పుట్టిన రోజు వేడుకను స్నేహితులు, కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా జరుపుకుంది. తన ప్రియడు ఆర్స్లాన్ గోని హాజరు కానప్పటికి సోషల్ మీడియాలో ప్రేమతో కూడిన శుభాకాంక్షలను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌పై హృతిక్ రోషన్ స్పందించడం విశేషం.
Hrithik Roshan reacts as Sussanne Khan receives love filled birthday post from boyfriend Arslan Goni
Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) మాజీ భార్య ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్(Sussanne Khan) తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ అర్స్లాన్ గోని(Arslan Goni) తనతో లేడు. అందుకని ఈ ప్రత్యేకమైన రోజు తన గర్ల్ ఫ్రెండ్‌తో లేనందున సోషల్ మీడియాలో ఓ స్వీట్ నోట్‌తో విషేస్ చెప్పాడు. అతని పోస్ట్‌పై హృతిక్ రోషన్ స్పందించారు. సుస్సానే, ఆమె ప్రియుడి మధ్య ఉన్న ప్రేమ చూస్తే తన హృదయం ఉప్పొంగిపోతుందని అన్నారు.
అర్స్లాన్ విషేస్ను చెబుతూ.. సుస్సాన్తో కలిసి తీసుకున్న ఫోటోలను జతచేశారు. వారి ట్రిప్‌లో, వివిధ లొకేషన్లో తీసుకున్న పిక్స్, వీడియోతో పాటు హ్యాపీ బర్త్ డే నా లవ్ @suzkr అని రాసుకొచ్చారు. దీనితో పాటు ఈ ప్రత్యేకమైన రోజు నీతో లేనందుకు బాధపడుతున్నాను. ఇప్పుడు నేను దూరంగా ఉండోచ్చు. కానీ మన మధ్య అద్భుతమైప జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తం నీ చెంత చేరాలని ఎప్పుడూ కోరుకుంటాను. మన కలుసుకున్న ప్రతిసారి అది వేడుకలానే ఉంటుంది. నా మీద నువ్వు చూపించే ప్రేమకు ముగ్దున్ని అవుతాను. నేను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను. ఇది కేవలం మనకు మాత్రమే అంకితం అని పేర్కొన్నారు.
అర్స్లాన్కు రిప్లై ఇస్తూ.. “Myyyyyyyyy Love my Jaaanuuuu. నువ్వే నా సర్వస్వం, నేను ఈ గ్రహం మీద అత్యంత అదృష్టవంతురాలిని, ఈ విశ్వం నాకు ఉత్తమమైన బహుమతిని ఇచ్చింది. అదే నువ్వు.” దీనికి “స్వీట్ (హార్ట్ ఎమోజి) జోడించి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇద్దరికి అని కామెంట్ చేశాడు. అయితే హృతిక్‌తో విడిపోయిన తరువాత సుస్సానే ఖాన్, అర్స్లాన్ గోని కలిసి గురువారానికి సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భంగా వారి బాండింగ్‌కు హ్యాపీ బర్త్‌డే చెప్పారు హృతిక్.