»Bhopal Gas Leak Based Web Series Release Soon At Ott
Bhopal Gas Leakపై వెబ్ సిరీస్.. వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్
భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై తీస్తోన్న ద రైల్వేమెన్ పార్ట్-1 వచ్చేనెల 18వ తేదీ నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ మేరకు యూనిట్ డేట్ అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.
Bhopal Gas Leak Based Web Series Release Soon At OTT
Bhopal Gas Leak: ప్రపంచంలో అతిపెద్ద విపత్తు భోపాల్ గ్యాస్ లీకేజీ (Bhopal Gas Leak). సరిగ్గా 1984 డిసెంబర్ 2, 3వ తేదీల్లో భోపాల్లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ప్లాంట్ నుంచి గ్యాస్ (మిథైల్ ఐసోసైనైడ్) లీకేజీ జరిగింది. చాలా మంది ఊపిరాడక చనిపోయారు. వేలమంది గాయపడ్డారు. గ్యాస్ లీకేజీ 6 లక్షల మందిపై ప్రభావం చూపించింది.
గ్యాస్ లీకేజీ (Gas Leak) జరిగి 39 ఏళ్లు అవుతోంది. ఆ ఘటనను ఆధారంగా చేసుకొని వెబ్ సిరీస్ తీశారు. గ్యాస్ లీక్ జరిగిన సమయంలో రైల్వే ఉద్యోగులు అక్కడికి సాయం చేసేందుకు వెళ్లారు. వందలమంది ప్రాణాలను కాపాడారు. అందుకే ద రైల్వేమెన్ పేరుతో సిరీస్ తీశారు. మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది. పార్ట్-1 వచ్చే నెల 18వ తేదీ నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ద రైల్వేమెన్ సిరీస్లో ఆర్ మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ కీ రోల్ పోషించారు. యదార్థ గాథ ఆధారంగా రూపొందించిన సిరీస్ ఆధ్యంతం ఆకట్టుకోనుంది. అసలు అప్పుడు ఏం జరిగింది..? ఎవరిదీ పొరపాటు..? విష వాయువు సమీప ప్రాంత ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపించిందనే అంశాలను క్షుణ్ణంగా వివరిస్తారు.