బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ వారం బోలే షావలి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. షావలీ- రతిక చివరి స్థానంలో ఉండగా.. కొన్ని ఓట్లతో బోలె ఎలిమినేట్ అయ్యారని సమాచారం.
ఎట్టకేలకు ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ బయటికొచ్చింది.
ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ప్రభాస్‌దే టాప్ ప్లేస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ పాన్ ఇండియా కటౌట్ పై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఆడియెన్స్ కూడా వందల కోట్లు కురిపిస్తున్నారు. ఈ రోజుతో నటుడిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు ప్రభాస్.
మెగా డాటర్ నిహారిక కొత్త ప్రాజెక్ట్ షురూ అయింది. విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసిన నిహారిక.. తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫస్ట్ కలిసి బయటికొచ్చారు.
పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ ఖాన్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్లు ఇచ్చేశారు జనాలు. జవాన్ దెబ్బకు థియేటర్ల దగ్గర మాస్ జాతర జరిగింది. కానీ సల్మాన్ ఖాన్ పరస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది.
సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలను పక్కకు పెట్టి.. ప్రజెంట్ వెకేషన్స్‌తో ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. అలాగే గ్లామర్ ట్రీట్ కూడా గట్టిగానే ఇస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్‌కు సై అన్నట్టుగా తెలుస్తోంది.
డిసెంబర్ 1న అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక ఇప్పుడు రిలీజ్‌కు ముందే ఐదు కోట్ల గిఫ్ట్ అందుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
మొన్న గుంటూరు కారం సాంగ్ వచ్చింది.. నెక్స్ట్ దీపావళి గేమ్ చేంజర్‌తో తమన్ రచ్చ చేస్తాడని.. మెగా ఫ్యాన్స్ భావించారు. కానీ అనుకున్నట్టే మళ్లీ గేమ్ చేంజర్ సాంగ్‌ను పోస్ట్‌పోన్ చేశారు. నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్(jr ntr) చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. కానీ దీని కంటే ముందే మరో సినిమాలో టైగర్ క్యామియో ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
సంగీత ప్రపంచంలో ముఖ్యమైన గ్రామీ అవార్డుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట ఎంపికైంది. ఈ పాట బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేట్ చేయబడింది. బజ్రీ వంటి పోషకమైన ధాన్యాలను ప్రోత్సహించడానికి అతను ఈ పాటను వ్రాసాడు.
సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువా విడుదల తేదీ ఖారారైనట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లోనే రిలీజ్ చేయనున్నట్లు నివేదికలు వచ్చాయి. అయితే అదే సమయంలో కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 కూడా ఉండటం ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతోంది.