ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ప్రభాస్‌దే టాప్ ప్లేస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ పాన్ ఇండియా కటౌట్ పై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఆడియెన్స్ కూడా వందల కోట్లు కురిపిస్తున్నారు. ఈ రోజుతో నటుడిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు ప్రభాస్.
Prabhas: మామూలుగా అయితే.. ఓ హీరోకి బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాప్స్ పడితే.. మార్కెట్ ఘోరంగా దెబ్బతింటుంది. ప్రభాస్ క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అయినా కూడా.. డార్లింగ్ క్రేజ్ ఇసుమంత తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఫ్లాప్ టాక్‌తో వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్ట గల హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి సినిమాతో బాలీవుడ్లో ఖాన్ త్రయాన్ని సైతం వణుకు పుట్టించిన ప్రభాస్.. నటుడిగా 21 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.
ప్రభాస్ నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’ నవంబర్ 11తో 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002 నవంబర్ 11వ తేదీన విడుదలైన ‘ఈశ్వర్’ చిత్రం ప్రభాస్‌ను.. అభిమానుల మదిలో ‘యంగ్ రెబల్ స్టార్’గా నిలిపింది. ఈ 21 ఏళ్ళ కెరీర్లో 21 చిత్రాల్లో నటించాడు ప్రభాస్. సక్సెస్ రేట్ తక్కువే అయినా, ‘బాహుబలి’తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అనిపించుకున్నాడు డార్లింగ్. తెలుగు నుంచి ఓ హీరో ఈ రేంజ్ స్టార్డమ్ అందుకుంటాడని ఎవ్వరు కూడా ఊహించలేదు.
ప్రభాస్ పాన్ ఇండియా కింగ్‌గా టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయాడు. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో హాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్నాడు. 21 ఏళ్ల కెరీర్లో.. ఈశ్వర్, వర్షం, ఛత్రపతి, యోగి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 లాంటి సూపర్ హిట్లతో ఆడియెన్స్‌లో చెరగని ముద్ర వేసిన ప్రభాస్.. డిసెంబర్ 22వ తేదీన ఎక్కడా లేని అంచనాలతో సలార్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత రానున్న కల్కి పాన్ వరల్డ్ రేంజ్లో రాబోతోంది. మారుతి సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉండగా.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఏదేమైనా.. డార్లింగ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.