ప్రభాస్‌ను డార్లింగ్ అని ఎందుకంటారో సలార్ సెట్‌లో తెలిసిందని మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ పేర్కొన్నారు. సెట్‌లో ఉన్న వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. టీజర్, ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువని.. సినిమాలో చాలా ఎమోషన్లు ఉన్నాయని అన్నారు.
బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన కొత్త సినిమా 'జోరుగా హుషారుగా' డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా పూజితా పొన్నాడ నటించింది. హీరోగా విరాజ్ అశ్విన్ మెప్పించాడా లేదా తెలుసుకుందాం.
ఉండొచ్చు కానీ.. మరి ఇంత ఉండకూడదు అనేది మహేష్ ఫ్యాన్స్ మాట. ఇదే మాటను మళ్లీ మళ్లీ తిప్పి కొడుతున్నాడు యంగ్ ప్రొడ్యూసర్. దీంతో గుంటూరు కారం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు బాగానే ఉంటది.. సినిమా తేడా కొడితేనే అసలు కథ ఉంటుందని అంటున్నారు అభిమానులు.
సరిగ్గా వారం రోజుల్లో మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. మూవీ లవర్స్ అంతా సలార్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సలార్ పై ఓ హీరో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఏదైనా కొత్త మూవీ ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే, ఆ ప్రమోషన్ కంటెంట్ ని అందరూ పాజిటివ్ గా తీసుకోకపోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతూ ఉంటాయి. ఇది చాలా కామన్. మంచి హిట్ సినిమాలకు కూడా అలాంటి కామెంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందరికీ పాట, ట్రైలర్ నచ్చకపోవచ్చు. అందరూ, దానిని మెచ్చుకోకపోవచ్చు. చాలా మంది దర్శక, నిర్మాతలు ఇలాంటి విష...
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని నేటి ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా మూవీగా తెరపైకి రానుంది. కంప్లీట్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొంతకాలంగా తక్కువ బజ్‌తో బాధపడుతుండగా, సాలార్...
ఈ వారం సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పిండం మూవీ( Pindam Movie) ఈరోజు థియేటర్లలో విడుదలైంది. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం.
ప్రముఖ కోలీవుడ్ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య, మార్క్ ఆంటోని సినిమా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈరోజు ఉదయం చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ జంట వివాహ వేడుక ఘనంగా జరుగగా..వీరి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రస్తుతం 'నా సామిరంగ' అనే సినిమా చేస్తున్నాడు కింగ్ నాగార్జున. మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా అంజిగాడి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
బిగ్ బాస్ తెలుగు నుంచి తొలిసారిగా వారం మధ్యలో ఎలిమినేషన్ జరగనుందని అని గత కొద్ది రోజులగా చాలా గట్టిగా వార్తలు వస్తున్నాయి. గత బిగ్ బాస్ సీజన్లలో కేవలం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే చివరి వారంలోకి ప్రవేశించారు. కానీ ఈసారి, ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనల్ వీక్‌లోకి ప్రవేశించారు, నివేదిక ప్రకారం, బిగ్ బాస్ బృందం మధ్య వారం ఎలిమినేషన్ కోసం ప్లాన్ చేసింది. బిగ్ బాస్ తెలుగు 7 మిడ్-వీక్ ఎలిమినేషన్ వివరాల...
విరాట పర్వం సినిమా తర్వాత ఆచితూచి అడుగెస్తున్నాడు దగ్గుబాటి రానా. ఇప్పటికే హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించిన రానా.. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. తేజతో కలిసి రాక్షస రాజాగా వస్తున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ 'గూఢచారి2' బిజీగా ఉన్నాడు. దీంతో తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉందంటూ ఓ ట్వీట్ వేశాడు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉందని.. ఈరోజే క్లారిటీ వచ్చింది.
ఎట్టకేలకు గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ బయటికి వచ్చేసింది. ఓ మై బేబీ.. అంటూ సాగే ఈ పాటను హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల పై డిజైన్ చేశారు. సాంగ్ బయటికి రావడమే లేట్ అన్నట్టు.. దారుణంగా నెగెటివ్ ట్రెండ్ అవుతోంది.