»Joruga Husharuga Movie Review Did Viraj Ashwin Impress As The Hero
Joruga Husharuga Movie Review: విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?
బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన కొత్త సినిమా 'జోరుగా హుషారుగా' డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. ఇందులో హీరోయిన్గా పూజితా పొన్నాడ నటించింది. హీరోగా విరాజ్ అశ్విన్ మెప్పించాడా లేదా తెలుసుకుందాం.
బేబీ సినిమాతో తన కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విరాజ్ అశ్విన్(Viraj Ashwin) హీరోగా, తెలుగమ్మాయి పూజిత పొన్నాడ(Pujita Ponnada) హీరోయిన్గా నటించిన సినిమా జోరుగా హుషారుగా. కొత్త దర్శకుడు అను ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో సిరి హనుమంత్, మధునందన్, సాయి కుమార్, రాజేష్ ఖన్నా, సోను ఠాకూర్, రోహిణి, బ్రహ్మాజీ ముఖ్యపాత్రల్లో నటించారు.
చిత్రం: జోరుగా హుషారుగా నటీనటులు:విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూరు, బ్రహ్మాజీ, క్రేజీ కన్నా, చంద్ర, తదితరులు సంగీతం: ప్రణీత్ మ్యూజిక్ దర్శకత్వం:అను ప్రసాద్ నిర్మాత: నిరీష్ తిరువీధుల ఛాయాగ్రహణం:పి.మహి రెడ్డి విడుదల తేదీ: 15/12/2023
కథ
సంతోష్ (విరాజ్ అశ్విన్) ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. అక్కడే ఆనంద్ (మధునందన్) సంతోష్‌కి బాస్‌గా ఉంటారు. సంతోష్ ప్రేమించిన నిత్య (పూజితా పొన్నాడ) అదే ఆఫీస్‌లో టీమ్ లీడ్‌గా జాయిన్ అవుతుంది. సంతోష్‌కి ముందు చెప్పదు. జాయిన్ అయిన తర్వాతే తెలుస్తుంది. వీళ్ల ప్రేమ విషయం ఎవరికీ తెలియకుడదని ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో బాస్ ఆనంద్‌ను ఇష్టపడుతున్న ఇంకో ఎంప్లాయి సుచిత్ర (సిరి హనుమంత్)ను ఆనంద్‌తో కలపాలని సంతోష్ ప్రయత్నిస్తాడు. కానీ ఆనంద్ సుచిత్రను కాకుండా నిత్యను లవ్ చేయడం ప్రారంభిస్తాడు. మరోవైపు తండ్రి చేసిన రూ.20 లక్షల అప్పు కొడుకు తీరుస్తాడని.. సంతోష్ తండ్రి ఎదురుచూస్తుంటాడు. అసలు ప్రేమ విషయం ఎందుకు ఆఫీస్‌లో తెలియనియ్యలేదు? ఆనంద్ నిత్య ప్రేమలో ఎలా పడ్డాడు? సుచిత్ర, ఆనంద్ కలిశారా? వారిని కలిపేందుకు సంతోష్ ఎందుకు ప్రయత్నించాడు? తండ్రికి సాయం చేశాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా సినిమా అనిపించిన.. కొంచెం కామెడీ కూడా ఉంటుంది. ఫస్టాఫ్‌లో ఆఫీస్‌లో విరాజ్, పూజిత మధ్య లవ్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. లవ్ సన్నివేశాలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. వీటితో పాటు కామెడీ కూడా కొంత పండిందని చెప్పవచ్చు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించే విధంగా ఉంటాయి. ప్రథమార్థంలో సంతోష్ లవ్ సీన్స్, తల్లిదండ్రులు స్టోరీలు కనిపిస్తాయి. ఇంటర్వెల్లో ట్విస్ట్‌తో బ్రేక్ ఇస్తారు. సుచిత్రను ప్రేమిస్తాడనుకున్న మధునందన్ నిత్యను ప్రేమించడంతో బ్రేక్ ఇస్తారు. ఈ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ద్వితీయార్థంలో ఆనంద్, సుచిత్రలను కలిపేందుకు సంతోష్ చేసే ప్రయత్నాలు, నిత్య, సంతోష్‌కు మధ్య మనస్పార్థలు, ఇంటి నుంచి అప్పుల బాధలు, ఒత్తిడితో సన్నివేశాలు సాగుతాయి. ద్వితీయార్థంలో సినిమా కాస్తా ఎమోషనల్‌గా ఉండటంతో పాటు టెన్షన్‌గా కూడా ఉంటుంది. తండ్రికొడుకుల మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా చివర అరగంట మాత్రం కామెడీని పండించారు.
ఎవరెలా చేశారంటే?
విరాజ్ అశ్విన్ హీరోగా బాగానే నటించారు. డైలాగ్స్, నటనతో ఆకట్టుకున్నారు.డ్యాన్స్ పరంగా కొంచెం కష్టపడాలి. హీరోయిన్ పూజితా తన అందంతో ఆకట్టుకుంది. తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక సోనూ ఠాకూర్, మధునందన్, రాజేష్ ఖన్నా, బ్రహ్మాజీ, సాయి కుమార్, రోహిణీ వాళ్ల పాత్రల్లో అలరించారు. డైరక్టర్ కథను ఇంకా కొత్తగా చూపిస్తే బాగుండేది.
సాంకేతిక అంశాలు
కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వలేదనిపించినా.. పాటలు యావరేజ్ అనిపిస్తాయి. సినిమాకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. కథ బానే ఉన్నా.. ఇంకా ఇంట్రెస్ట్‌గా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+విరాజ్ నటన
+ఇంటర్వెల్ ట్విస్ట్
+ద్వితీయార్థంలో కామెడీ
మైనస్ పాయింట్స్
-కథలో కొత్తదనం లేకపోవడం
-కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించడం
-ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు