ప్రభాస్‌ను డార్లింగ్ అని ఎందుకంటారో సలార్ సెట్లో తెలిసిందని మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ పేర్కొన్నారు. సెట్లో ఉన్న వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. టీజర్, ట్రైలర్లో చూపించింది చాలా తక్కువని.. సినిమాలో చాలా ఎమోషన్లు ఉన్నాయని అన్నారు.
Prithvi Raj Sukumaran Do you know why everyone calls Prabhas Darling?
Prithvi Raj Sukumaran: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్‌నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సలార్(Salaar). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమైంది. మూవీలో ప్రభాస్‌తో పోటీ పడడానికి మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi Raj Sukumaran) నటించారు. మొదటి సారి తెలుగులో విలన్ పాత్రలో కనిపించనున్నారు. సలార్ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభాస్ గురించి, మూవీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సలార్‌లో ప్రభాస్ దేవా పాత్రలో కనిపించనున్నారు, తాను వరదరాజ మన్నార్ రోల్ పోషించారన్నారు. తన కెరీర్లో ఇప్పటి వరకు ఇంత గొప్ప స్క్రిప్ట్ చూడలేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని టీమ్ అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభాస్‌ను ఎవరైనా ఇష్టపడుతారు. తనకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని అందులో ప్రభాస్ ఒకరు అని చెప్పారు. ఆయన సెట్లో అందరినీ ఎంతో మంచిగా చూసుకుంటాడని అన్నారు. అందరికి భోజనం తెప్పిస్తాడు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. అందరిని ప్రేమగా డార్లింగ్ అని పిలవడంతో ఎదుటివారు కూడా ఆయన్ను అలాగే పిలవడానికి ఇష్టపడుతారని అర్థమైందన్నారు. ఇక టీజర్, ట్రైలర్లో చూసింది చాలా తక్కువ అని, కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎన్నో భావేద్వేగాలు ఉన్నాయని వెల్లడించారు. సినిమా రెండో భాగానికి కూడా చక్కని లీడ్ ఉంది అని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు. మొదటి టికెట్‌ను దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కొనుగోలు చేశారు.