Adivishesh: అఫిషీయల్.. అడివి శేష్‌తో శృతి హాసన్, కానీ ఇది కొత్త ప్రాజెక్ట్!
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ 'గూఢచారి2' బిజీగా ఉన్నాడు. దీంతో తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉందంటూ ఓ ట్వీట్ వేశాడు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉందని.. ఈరోజే క్లారిటీ వచ్చింది.
క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ విజయం.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. చివరగా మేజర్, హిట్ 2తో ఫ్రాంచైజీతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ‘మేజర్’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే.. ఇప్పటికే గూఢచారి 2 సినిమాలో హీరోయిన్గా బనితా సందు నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు అడివి శేష్. కానీ రీసెంట్గా శేష్ ఎక్స్ శృతి అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఓ హీరోయిన్గా నటిస్తోందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ అది కాదని క్లారిటీ ఇచ్చేశారు. హాట్ బ్యూటీ శృతి హాసన్‌తో కలిసి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు అడివి శేష్. ప్రస్తుతం #SeshEXShruti అని పిలుస్తున్న ఈ సినిమాతో డీఓపీ షనీల్ డియో మొదటిసారి దర్శకుడిగా మారుతున్నాడు. డిసెంబర్ 18న #SeshEXShruti టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తున్నట్లుగా శేష్ అనౌన్స్ చేసాడు. అలాగే.. అడివి శేష్ ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఇందులో శేష్ ఫేస్‌ని కవర్ చేసుకుంటూ బ్లాక్ కర్చీఫ్ కట్టుకోని ఉన్నాడు. దీంతో ఈ సినిమా కూడా ఓ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతోందనే చెప్పాలి. అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ కలిసిఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాయి. దీంతో శృతి హాసన్, అడివి శేష్ కలిసి నటించేది గూఢచారి సీక్వెల్లో కాదు.. కొత్త సినిమాలో అనే క్లారిటీ వచ్చేసింది. మరి అడివి శేష్ నుంచి ఈసారి ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి.