డిసెంబర్ 22న ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెకండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు మాస్ మహారాజా. ఇప్పటికే ఈ ఏడాదిలో మూడు సినిమాలతో అలరించిన మాస్ రాజా.. నెక్స్ట్ ఇయర్ ఆరంభంలో ఈగల్‌గా వస్తున్నాడు.
తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నేడు సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించారు. ఆ సమస్యలను పరిష్కరిస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు.
దొంగతనానికి వచ్చి, రేప్ చేసి, మర్డర్ చేసిన హంతకుల కోసం పోలీసులు ఏం చేశారు. వారిని ఎలా పట్టుకున్నారు అనేది కన్నూర్ సినిమా. ఈ ప్రాసెస్‌లో పోలీసులపై ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉంటుందో?
లంచం తీసుకున్న పోలీసును సోసైటీ ఎలా చూస్తుందో. ఇలాంటి పరిస్థితుల్లో హీరో టీమ్ పదిరోజుల్లో హంతకులకు ఎలా పట్టుకున్నారు అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది.
పృథ్వీరాజ్ కోసమే సలార్‌లో వరదరాజు మన్నార్ పాత్ర రాశానని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నారు. ఎంతో ముఖ్యమైన ఈ పాత్రలో వేరే ఎవరని కూడా ఊహించలేదని చెప్పారు. ఆయన కేవలం ఆర్టిస్టుగానే కాకుండా డైరెక్టర్‌లా ఆలోచిస్తారని ప్రశంసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పృథ్వీ లేకుండా సలార్ లేదని అన్నారు.
బిగ్ బాస్ విన్నర్ అయిన తరువాత పల్లవి ప్రశాంత్‌పై ఒక వైపు పూల వర్షం కురుస్తుంటే మరో వైపు పోలీసు కేసులు ఫైల్ అవుతున్నాయి. తనకు వచ్చిన బహుమతిని రైతులకు పంచుతా అంటున్న ప్రశాంత్ ఈ కేసులు గురించి మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టుకున్న తాను బయపడేది లేదన్నారు.
అనేక రోజులుగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ రానే వచ్చింది. హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో వచ్చిన హనుమాన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ వీడియో ఎలా ఉందో చూసేయండి మరి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. అమ్మడు ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తుందో తెలియదు కానీ.. చాలా సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి రెడీ అవుతోంది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇన్నాళ్లు పవన్ డేట్స్ కోసం ఎదురు చూసిన హరీష్ శంకర్..రోజు రోజుకి ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతుండడంతో మాస్ మహారాజాతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా రీమేక్‌గా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
చెప్పినట్టుగానే..ఈ ఒక్క ట్రైలర్ చాలు, సలార్ హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లడానికి అనేలా ఉంది సలార్ రిలీజ్ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్‌లో కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..లేటెస్ట్ ట్రైలర్‌తో దుమ్ముదులిపేశాడు.
వచ్చే శుక్రవారమే ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటేడ్ మూవీ 'సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్' థియేటర్లోకి రానుంది. డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ని మాస్ మేనియాలో ముంచెత్తడానికి వచ్చేస్తన్నారు. దీంతో అభిమానులు హంగామా మామూలుగా లేదు.
స్టార్ హీరోయిన్ సమంతా తన పర్సనల్ లైఫ్ గురించి కీలక విషయం వెల్లడించింది. రెండో పెళ్లి చేసుకుంటారా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినిమాల పరంగా స్పీడ్ పెంచింది. సిరీస్‌లు, సినిమాలు కమిట్ అవుతోంది. గతంలో హీరోయిన్‌గా ట్రై చేసిన నిహారిక..మధ్యలో పెళ్లి చేసుకుంది. కానీ విడాకుల తర్వాత మళ్లీ హీరోయిన్‌గా ట్రై చేస్తోంది.
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమరదీప్ అభిమానులు పరస్పర దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇరువురి అభిమానులపై కేసులు నమోదు చేశారు.