ఇన్నాళ్లు పవన్ డేట్స్ కోసం ఎదురు చూసిన హరీష్ శంకర్..రోజు రోజుకి ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతుండడంతో మాస్ మహారాజాతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా రీమేక్‌గా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
స్ట్రెయిట్ సినిమాలు చేయగల సత్తా ఉన్న కూడా.. సేఫ్ సైడ్‌గా రీమేక్ సినీమాలతోనే సరిపెట్టుకుంటున్నారు హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లు. చివరగా 2019లో రీమేక్ మూవీ గద్దలకొండ గణేష్‌తో మరో సాలిడ్ హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఈ సినిమా తర్వాత పవన్‌తో సినిమా ప్లాన్ చేశాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ భవదీయుడు భగత్ సింగ్ కాస్త.. ఉస్తాద్ భగత్ సింగ్‌గా మారిపోయింది. ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తేరీ రీమేక్‌గా తెరకెక్కుతోంది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత.. హరీష్‌కు డేట్స్ ఇచ్చారు పవర్ స్టార్. స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేసిన హరీష్.. అదే స్పీడ్‌లో ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు.
గబ్బర్ సింగ్ తర్వాత మరో హిట్ లోడింగ్ అని పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేసేలా చేశాడు. కానీ పవన్ పాలిటిక్స్ కారణంగా.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. వచ్చె ఎలక్షన్స్ వరకు పవన్ డేట్స్ దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ మధ్యలో మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు హరీష్. మాస్ మహారాజా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమాను అనౌన్స్ చేసి.. షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. వీలైనంత తొందరగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ సినిమా కూడా హరీష్ శంకర్ మార్క్ రీమేక్‌గా రాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
హిందీ హిట్ మూవీ ‘రైడ్’ని మిస్టర్ బచ్చన్‌గా రీమేక్ చేస్తున్నట్టుగా సమాచారం. రైడ్ సినిమా హీరో అజయ్ దేవగన్ ‘మిస్టర్ బచ్చన్’ పోస్టర్‌ను షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో.. ఇది పక్కా రీమేక్ కన్ఫర్మ్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. అయితే రీమేక్ సినిమాలతో సూపర్ హిట్ కొట్టడం హరీష్ శంకర్ స్టైల్ కాబట్టి.. ఈ బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ అవడం పక్కా. మరి మిస్టర్ బచ్చన్ ఎలా ఉంటుందో చూడాలి.