Hritik – Jr.NTR : ‘వార్ 2’తో రికార్డ్స్ క్రియేట్ చేయనున్న ఎన్టీఆర్!
Hritik - Jr.NTR : అసలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ని ఎవరు ఊహించలేదు. కానీ ఇంటర్నేషన్ మీడియా సైతం హృతిక్, తారక్ ప్రాజెక్ట్‌ని కన్ఫామ్ చేయడంతో.. దీంతో నందమూరి ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్ అంటే.. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ స్క్రీన్ షేరింగ్ అంటే.. అది మామూలు విషయం కాదు. అది కూడా ఎన్టీఆర్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటున్నారు. అలాంటి ప్రాజెక్ట్ థియేటర్లోకి వస్తే.. రికార్డుల సునామి రావడం పక్కా. వార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ స్పై యూనివర్స్‌లోకి యంగ్ టైగర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాకపోతే ఈ సినిమాలో హృతిక్ రోషన్ క్యారెక్టరే హైలెట్ అంటున్నారు. కానీ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ లాంటి హీరో డీ కొడితే.. స్క్రీన్స్ చిరిగిపోతాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంత అనేది.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ వర్గాల ప్రకారం 100 కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఓ నయా రికార్డ్ అని అంటున్నారు. విలన్ టచ్ ఉన్న రోల్‌కు 100 కోట్లు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఇప్పటివరకు నెగెటివ్ పాత్ర చేసిన ఏ నటుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకోలేదట. అందుకే తారక్ వార్2తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్ కూడా 100 కోట్లు తీసుకుంటున్నాడట. ఇది కూడా రికార్డేనని అంటున్నారు. హీరోతో పాటు ఈక్వల్‌గా విలన్ రెమ్యూనరేషన్ ఉండడం ఇప్పటి వరకు జరగలేదట. మరి అనౌన్స్మెంట్కు ముందే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తే.. వార్ 2 రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.