»Ntr Who Is About To Start A War Has A Special Meeting With The Director
Hrithik : వార్ మొదలుపెట్టనున్న ఎన్టీఆర్, డైరెక్టర్ తో స్పెషల్ మీట్
ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత ఆయనకు వరస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో దేవర మూవీ కోసం శ్రమిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ (Bollywood) లో ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన విషయం తెలిసిందే. వార్ 2 గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా తెరకెక్కబోతున్న ‘వార్ 2’లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీతోనే యంగ్ టైగర్.. బాలీవుడ్(Bollywood)లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వార్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాగా, దానికి మించి ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ ఏడాది చివరలో ‘వార్ 2’ టీమ్ తో జాయిన్ కాబోతున్నారు.
ఇక ‘దేవర’కు సంబంధించిన తాజా షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు ఎన్టీఆర్ (NTR). ఈ నేపథ్యంలో ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆయనను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) ఇద్దరు మీట్ అయ్యారు. ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కు కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా వివరించారట. సినిమా కథ(Movie Story), తన క్యారెక్టర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చిట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి చర్చించేందుకు అయాన్ గతంలో ఓసారి ఎన్టీఆర్ ను కలిశారు.
సినిమా కథ గురించి వివరించారు. తాజాగా స్క్రిప్ట్ (Script) వర్క్ కంప్లీట్ కావడంతో ఫైనల్ గా ఓసారి ఆయనకు వివరించారట. అటు ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా చాలా వరకు ముంబై(Mumbai)లోనే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్(Budget)వెచ్చిస్తోందట. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.