సినిమాలే కాదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపికే హీరో విశాల్. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా రాజకీయంగా విశాల్ సెన్సేషన్ అవుతునే ఉంటాడు. కానీ ఈ మధ్య సినిమాల పరంగా రేసులో వెనకబడిపోయాడు. త్వరలోనే 'మార్కో ఆంటోని' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి సయమంలో నయనతార గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి.
హీరో విశాల్ (Vishal) గురించి అందరికీ తెలిసిందే. పందెం కోడి సినిమాతో తమిళ్, తెలుగులో హీరోగా తనకంటూ ప్యత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తు వస్తున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో విశాల్‌కు సరైన విజయాలు దక్కడం లేదు. సినిమాల కోసం ఎంత రిస్క్ అయిన చేసే విశాల్.. చివరగా ‘లాఠీ’ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ సినిమా కోసం విశాల్ రెండు, మూడు సార్లు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. సినిమా సెట్స్‌లో ఎముకలు విరగొట్టుకున్నాడు. అలాగే ‘మార్క్ ఆంటోని’ సినిమా కోసం గాయాల పాలయ్యాడు.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రీతివర్మ హీరయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. దర్శకుడు సెల్వరాఘవన్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్‌కుమార్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో నయనతారను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విశాల్. ఈయన నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి కూడా కావడంతో.. నయనతారపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నయనతార సినిమా ప్రమోషన్స్ ఎందుకు రాదు? అనే క్వశ్చన్‌కు విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌కు నయనతార ఎప్పుడూ హాజరు కాలేదు. అది ఆమె వ్యక్తిగత హక్కు. కాబట్టి, ఈవెంట్స్‌కు రమ్మని ఆమెను బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే, నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు సినిమా ప్రమోషన్స్‌కు హాజరైతే బాగుంటుంది అని అన్నారు. అలాగే రాజకీయంగాను విశాల్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఇకపోతే గతంలో విశాల్, నయనతార కలిసి ‘సెల్యూట్’ అనే సినిమాలో నటించారు.