సౌత్ లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార (Nayanatara) తొలిసారి తన పిల్లల్ని చూపించింది. ఈ ఏడాది తన ప్రియుడు విగ్నేష్ (Vignesh Shivan)తో నయనతార వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు వీరు పేరెంట్స్ అయ్యారు. నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున క్యూ కట్టేవారు.
గత కొన్ని రోజుల నుంచి నయనతార (Nayanatara) సోషల్ మీడియాకి, మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది. ఇక విగ్నేష్ శివన్ మాత్రమే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. నేడు మదర్స్ డే సందర్భంగా నయనతార, విగ్నేష్ శివన్ (Vignesh Shivan) తమ పిల్లల ఫోటోలను షేర్ చేశారు.
నయనతార (Nayanatara) తన పిల్లలని ఎత్తుకుని ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని విగ్నేష్ షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి. తొలిసారి తన పిల్లల ముఖాలు చూపించడంతో అభిమానులు వారి పిల్లలను ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం నయనతార పిల్లలు ఉయిర్, ఉలగ్ క్యూట్ ఫొటోస్ నెట్టింట వైరల్(Photos Viral) అవుతున్నాయి.