ఈ దసరాకి సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున.. బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్ పై భారీ బజ్ ఉండడంతో.. అదే రేంజ్లో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండో రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే నాగ్ మాత్రం వసూళ్ల పరంగా మెగాస్టార్‌తో పోటీ పడలేకపోయారని.. దాంతో ది ఘోస్ట్ యావరేజ్‌గా నిలిచేలా ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. నాగ్ మాత్రం గాడ్ ఫాదర్ హిట్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్నారని టాక్.
గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాతో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నాడని చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే మోహన్ రాజా కథ చెప్పాడని.. అది కూడా నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్‌గా రానుందని వినిపిస్తునే ఉంది. అయితే నాగ్ ఇంకా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. ‘గాడ్ ఫాదర్’ రిజల్ట్‌ను బట్టి మోహన్ రాజాతో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే టాక్ నడిచింది. ఇక ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ హిట్‌తో దాదాపుగా నాగ్ నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయిందని అంటున్నారు. మోహన్ రాజా కూడా ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ నాగ్ వందో సినిమా కావడంతో.. స్పెషల్‌గా ఉండాలనే అఖిల్‌తో కలిసి మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. ఏదేమైనా గాడ్ ఫాదర్ హిట్‌తో నాగ్-మోహన్ రాజా కాంబినేషన్ దాదాపుగా ఓకే అయిపోయినట్టేనని చెప్పొచ్చు.