Naa samiranga: 5 రోజుల కలెక్షన్స్.. టార్గెట్ రీచ్డ్!
సంక్రాంతి తనకు బాగా కలిసొస్తుందని.. తక్కువ టైంలో సినిమా అనౌన్స్ చేసి.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేసి.. నా సామిరంగ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేశాడు కింగ్ నాగార్జున. అనుకున్నట్టే ఈ సినిమాతో నాగ్ హిట్ కొట్టేశాడు.
Naa samiranga: నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి విడుదలైంది. డే వన్ నుంచే ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా 18 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న నా సామిరంగ.. ఇప్పటికే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఐదో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు స్టేట్స్లో ఐదవ రోజు రెండున్న కోట్లకు పైగా షేర్ అందుకుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో 18.17 కోట్ల షేర్ని అందుకుంది.
అలాగే వరల్డ్ వైడ్‌గా 35.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ వీకెండ్‌తో నా సామిరంగకు మంచి లాభాలు రానున్నాయి. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగానే అట్రాక్ట్ చేసింది. సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ తర్వాత బ్రేక్ అయిన సినిమాగా నా సామిరంగ నిలిచింది. దీంతో సంక్రాంతి బరిలో నిలిచి మరోసారి హిట్ అందుకున్నాడు నాగార్జున. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. మరి లాంగ్ రన్లో నా సామిరంగ ఎంత రాబడుతుందో చూడాలి.