Personality Test: మానవ శరీరంలో అత్యంత అందమైన భాగం కళ్లు. అవి మన మనసులోని భావాలను బయటపెడుతుంది. మనలో ఎలాంటి ఫీలింగ్ ఉన్న సరే కళ్లను చూడగానే తెలిసిపోతుంది. సాదారణంగా మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కళ్లు లేదా నోటిని చూసి మాట్లాడతాం. అలా మనం మాట్లాడేటప్పుడు మంచిగా అబ్సర్వ్ చేస్తే వారు మనసులో ఏమనుకుంటున్నారో కనిపెట్టవచ్చు. ఐతే.. కళ్లను చూస్తూ వ్యక్తికి సంబంధించిన అనేక రహస్యాలు తెలుసుకోవచ్చు. కళ్ల భాష చదవడం చదవడం అందిరికి రాదు, దానిపై ఒక అవగాహన ఉండాలి. నిజానికి కళ్ల భాష అర్థం చేసుకోవడం చాలా కష్టతరం. కానీ చూసే కంటి రకం, రంగు నుంచి అనేక ఆలోచనలను ఊహించవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే..కంటిరంగు నల్లగా, అందంగా ఉంటే, వారి జీవితంలో సంతోషం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
గుండ్రగాని కళ్ళు ఉన్నవారు తమ ఎదుగుదల కోసం ప్రతి పని చేస్తారు. వీరు సాదారణంగా సెల్ఫిష్ లయి ఉంటారు. ఇతరుల మంచి, చెడుల గురించి అసలు ఆలోచించరు. వారి మనసుకి ఏం అనిపిస్తే అది చేసుకుంటుపోతారు. ఇక ఎరుపు కళ్లు ఉన్న వ్యక్తులు చెడు సంఘటనలను, సమస్యలను ఎదుర్కొంటారు. కానీ వారు ఎటువంటి చెడు సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద కళ్ళు ఉన్నవారు..వీరు చాలా ఆకర్శణీయంగా ఉంటారు. వీరు జీవితంలో ఎక్కువ భాగం ఆనందంగా గడుపుతారు. మంచి మిత్రులను కలిగి ఉంటారు. వీరితో కలిసి ఉన్నప్పుడు ఇతరులకు సేఫ్టీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక బ్రౌన్ ఐస్ వారి గురించి తెలుసుకుందాం. ఈ కలర్ ఐస్ ఉన్న వారు ఇట్టే మోసం చెయ్యగలరు. వీరు అబద్దాలు ఎక్కువగా చెప్తారు. వారు అబద్దాలు చెప్తే నమ్మే విధంగా ఉంటాయి. తమ మాటలతో అందరిని తమవైపు తిప్పుకుంటారు. అందువల్ల బ్రౌన్ కలర్ కళ్ళు ఉన్నవారితో చాలా జాగ్రత్తగా, తెలివిగా మెలగాలి.
ఇక చివరగా చిన్న కళ్ళు ఉన్నవారు. వీరు చాలా ప్రతిభావంతులు. చాలా కష్టతర పరిస్థితుల్లో కూడా తమ మనసును దృఢంగా ఉంచుకుంటారు. ఏ సమస్య వచ్చినా సరే దాన్ని అధిగమించి ముందుకెళతారు. చివరికి విజయాన్ని సాధిస్తారు. వీరు చిన్న కళ్ళతొ ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. లోతు కళ్లు కొంతమంది కళ్ళు లోపలికి ఉంటాయి. అలాంటి కళ్ళు ఉన్నవారు ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. వీరితో కొన్ని సార్లు ఆలోచించి మెలగాలి.