»Prabhas Surgery Again For Prabhas Did The Injury Reverse
Prabhas: ప్రభాస్‌కి మళ్లీ సర్జరీ? గాయం తిరగబెట్టిందా?
పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. తాజాగా ప్రభాస్‌కు మరోసారి సర్జరీ అనే న్యూస్ వైరల్‌గా మారింది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు రెబల్ స్టార్ అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. గతంలో రాధే శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే.. సలార్ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యాడని.. కాదు బాహుబలి సమయంలోనే గాయాల పాలయ్యాడని అన్నారు. దాంతో ఆ మధ్య మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వినిపించింది. సలార్ రిలీజ్‌కు ముందు ప్రభాస్ యూరప్ ట్రిప్‌కు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. అక్కడే సర్జరీ చేయించుకున్నాడని తెలిసింది.
సలార్ రిలీజ్ ముందే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. ఇక మోకాలి సర్జరీ సక్సెస్ అయిందని.. ఇక ప్రభాస్ కోలుకున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గాయం తిరగబెట్టిందని.. మళ్లీ సర్జరీ తప్పదంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం కల్కి 2829 AD, రాజా సాబ్ చిత్రాల షూటింగ్స్‌లో ప్రభాస్ పాల్గొంటున్నాడు ప్రభాస్. దీంతో మళ్లీ మోకాలి గాయం తిరగబెట్టిందని.. సర్జరీ కూడా అవసరం అని అంటున్నారు. అందుకే.. మరోసారి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ప్రభాస్ విదేశాలకు వెళ్లనున్నాడంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు గానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. డార్లింగ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ప్రభాస్‌కు మళ్లీ సర్జరీ అయితే.. కల్కి, రాజా సాబ్ సినిమాల షెడ్యూల్స్‌లో వాయిదా తప్పదంటున్నాఉ. సమ్మర్ కానుకగా మే 9న కల్కి రిలీజ్ అవుతుండగా.. డిసెంబర్లో రాజా సాబ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.