ప్రకాశం: కనిగిరి మండలం యడవల్లిలో లక్ష్మి నరసింహాస్వామి, అభయాంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణం కోసం శనివారం ఆలయ నిర్వహకులు సుదర్శన యాగం పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆలయ పునః నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.