Mrinal Takhur visited Elamma in Balkampeta.. Photo viral
Mrinal Takhur: సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrinal Takhur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చక్కని అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారింది. రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లో భాగంగా మృణాల్ బల్కంపేట ఎల్లమ్మతల్లిని దర్శించుకుంది.
మృణాల్ నటించిన హాయ్ నాన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మృణాల్ పూజా మేరి జాన్ అనే మూవీలో నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్(Familystar) చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్లు త్వరలోనే మొదలు కాబోతున్నాయి అని మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో మృణాల్ అమ్మవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది.