టాలీవుడ్(Tollywood) హీరో కార్తికేయ(karthikeya) 'బెదురులంక 2012' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
టాలీవుడ్(Tollywood) హీరో కార్తికేయ(karthikeya) ‘బెదురులంక 2012’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ నిర్మించాడు. మూవీకి క్లాక్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా నేహాశెట్టి నటించింది. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ పోస్టర్స్‌ను వదులుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
గ్రామీణ నేపథ్యంలో “బెదురులంక 2012” సినిమా సాగుతున్నట్లు టీజర్(Teaser)ను చూస్తే అర్థమవుతోంది. లంకల గ్రామానికి చెందినటువంటి ‘బెదురులంక’ అనే గ్రామంలో 2012లో ఈ సినిమా కథ నడుస్తుంది. 2012వ కాలంలో యుగాంతం జరుగనున్నట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రచారం ఆధారంగానే జరిగినటువంటి సంఘటనలతో ఈ సినిమా సాగనుంది. టీజర్(Teaser) అద్భుతంగా ఆకట్టుకుంటోంది.
ఇకపోతే టీజర్(Teaser)లో హీరో, హీరోయిన్ ప్రేమ వ్యవహారం, డ్రామా కంపెనీకి సంబంధించిన సందడి కలుపుకుంటూ కథ సాగుతుంది. లవ్, యాక్షన్, కామెడీ సీన్లను కట్ చేసి టీజర్‌గా చూపించారు. ఈ మూవీలో అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ రామ్ ప్రసాద్ వంటివారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి మణిశర్మ(mani sharma) మ్యూజిక్ అందించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.