Megastar Tweet: మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
ఉమెన్స్ డే(Womens Day) సందర్భంగా సినీ ప్రముఖులంతా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వనితలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల(Celebrities) వరకూ అందరూ మహిళల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరింజీవి(Megastar Chiranjeevi) కూడా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా తమ న్యాయబద్దమైన స్థానం కోసం పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలు(Womens) అందరికీ మెగాస్టార్(Megastar) సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరో కూడా తెలిపారు. తన తల్లి అంజనమ్మ, భార్య సురేఖలు తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వారని మెగాస్టార్ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ పోస్టును షేర్ చేశారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేసిన ట్వీట్(Tweet) నెట్టింట వైరల్(Viral) అవుతోంది. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి(Chiranjeevi) ఈ మధ్యే ‘వాల్తేరు వీరయ్య’తో సక్సెస్ సాధించారు. ఈ సినిమా తర్వాత ‘భోళా శంకర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ(Manisharma) కుమారుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.