ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక్క ఫోటోలో కబడ్టీ టీమ్ అంతా మెగా హీరోలు కనిపించడంతో.. పిక్ ఆఫ్ ది డేగా నిలిచింది. వరుణ్, లావణ్య పెళ్లిలో మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
Mega photo: ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చాలా గ్రాండ్‌గా ఇటలీలో జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఈ పెళ్లి నుంచి ఎన్ని ఫోటోలు బయటికి వచ్చినప్పటికీ.. ఒక్క ఫోటో కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు మెగాభిమానులు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించకపోవడంతో.. పవర్ స్టార్ ఎక్కడ? అంటూ ట్రెండ్ చేశారు అభిమానులు. ఫైనల్‌గా కొత్త జంటతో మెగా అల్లు హీరోలు కలిసి దిగిన ఫోటోని చిరు తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసారు. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, అల్లు అర్జున్, శిరీష్‌లతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
ఈ ఫోటోలో అందరూ ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపించగా.. పవన్ మాత్రం చాలా సింపుల్‌గా కనించారు. బాబాయ్ లాగే అబ్బాయ్ రామ్ చరణ్ కూడా చాలా సింపుల్‌గా ఉన్నాడు. చిరు, చరణ్ మధ్యలో టీషర్ట్‌తో పవన్ కనిపించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి పవన్ ఫోటో ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఫైనల్‌గా అభిమానుల కోరిక తీరుస్తూ ఇప్పుడు ఈ గ్రూప్ ఫోటో బయటకి వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగా హీరోలందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు.. మెగా, అల్లు హీరోల మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఈ ఫోటోనే నిదర్శనమంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.