శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్(Sunisith) మరో వివాదంలో చిక్కుకున్నాడు. స్టార్ హీరోలు, హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సునిశిత్ ఫేమస్ అయ్యాడు. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Actress Lavanya tripati)ని పెళ్లి చేసుకున్నానని, చిరంజీవి(Chiranjeevi)తో మందు కొట్టానని, ఇంకా ఏవేవో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సునిశిత్ వార్తల్లో నిలిచాడు. తాజాగా ఈ శాక్రిఫైజింగ్ స్టార్‌ను మెగా అభిమానులు చితకబాదారు. ఈ మధ్యనే ఓ యూట్యూబ్ ఛానల్‌కు సునిశిత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
సునిశిత్‌ను చితకబాదిన మెగా ఫ్యాన్స్ వీడియో:
ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ ను చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్ 🔥🔥🔥
తనకు ఉపాసన కొణిదెల(Upasana Konidela) క్లోజ్ ఫ్రెండ్ అని ఇంటర్వ్యూలో సునిశిత్(Sunisith) చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా తనతో కలిసి ఉపాసన లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినట్లు తెలిపాడు. ఉపాసనకు ఆడి ఎలక్ట్రిక్ వెహికల్ ఉందని, అందులోనే తామిద్దరం గోవాకు వెళ్లొచ్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్(Ramcharan) తనకు ఫ్రెండ్ అని, ఉపాసనతో చాట్ చేయమన్నాడని, ఉపాసనను ప్రేమలో పడేయమన్నాడని సునిశిత్ చెప్పాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుమార్తె సుస్మితా కొణిదెలతో కూడా తాను లాంగ్ డ్రైవ్ కి వెళ్లినట్లు తెలిపాడు.
మెగా ఫ్యామిలీ(Mega Family) మీద సునిశిత్(Sunisith) చేసిన వ్యాఖ్యలకు అభిమానులు ఫైర్ అయ్యారు. మా వదిన మీదే కామెంట్స్ చేస్తావా? అంటూ సునిశిత్ ను చితక్కొట్టారు. సునిశిత్ చేత ఉపాసనకు క్షమాపణలు చెప్పించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తప్పుడు వ్యాఖ్యలు చేశానని, పొరపాటు అయ్యిందని, ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు చేయనని, ఆ విధంగా మాట్లాడినందుకు బాధపడుతున్నానని సునిశిత్ క్షమాపణలు తెలిపాడు.