ఆచార్య ఫ్లాప్‌తో నిరాశగా ఉన్న మెగాభిమానులు.. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌తో పండగ చేసుకుంటున్నారు. లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్.. మళయాళంలో కంటే తెలుగులోనే అదిరిపోయిందంటున్నారు. ఇక ఇదే జోష్‌తో మెగా అప్టేట్స్ రెడీ చేస్తున్నారు మెగాస్టార్. దసరాకు భారీ విజయాన్ని అందుకున్న చిరు.. సంక్రాంతికి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మెగా 154, భోళా శంకర్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో బాబీ దర్శకత్వంలో మెగా 154 మూవీ ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్‌తో ఊర మాస్ కంటెంట్‌తో రాబోబోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ పోలిస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా మెగా 154 టీజర్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ లేదా గ్లింప్స్‌ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అతి త్వరలోనే దీనిపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.
నిజంగానే దీపావళికి మెగా 154 అప్డేట్ ఉంటే మాత్రం.. మెగా ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. అంతేకాదు సంక్రాతికి రిలీజ్ అంటున్నారు కాబట్టి.. అప్పటి నుంచి వరుసగా అప్టేట్స్ ఉంటాయంటున్నారు. ఇక శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నఈ చిత్రానికి.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.