Santosh Sobhan: పెళ్లంటేనే డిప్రెషన్.. కానీ అలా పెళ్లి చేసుకుంటా!
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ ఒక్క ఏడాదిలోనే మూడు నాలుగు సినిమాలను ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Santosh Sobhan: సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ చిత్రం.. ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమాతో.. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ, పెళ్లి నేపథ్యంలో రూపొందిన చిత్రం గురించి సంతోష్ (Santosh) పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
చాలా తెలుగు సినిమాల క్లైమాక్స్‌లో చివర్లో పెళ్లి పీటల మీద నుంచి హీరోయిన్ను తీసుకొని వెళ్లిపోతాడు ఈ హీరో. ఆడియెన్స్ కూడా ఇదే కోరుకుంటారు. ఆ పెళ్లి పీటల మీద ఒకడు ఉంటాడు.. వాడి పరిస్థితేంటి? ఎంత మందికి కార్డులిచ్చాడో, ఎన్ని అప్పులు చేశాడో, బట్టలు ఎలా కొనుకున్నాడో? అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. అలాంటి కథే ‘ప్రేమ్ కుమార్’ సినిమా. అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా చేశాడు. ఆ తర్వాత దర్శకుడు కావాలని అనుకున్నప్పుడు ప్రేమ్ కుమార్ కథను రాసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక మీ పెళ్లి గురించి ఇంట్లో అడగటం లేదా? అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చేశాడు. ఇప్పటికైతే ఆ ఆలోచన అస్సలు లేదు. పెళ్లి బట్టలు చూస్తుంటేనే డిప్రెషన్ వచ్చేస్తుంది. పెళ్లి తతంగం వద్దు అనిపిస్తుంది. చేసుకుంటే రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇక అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ.. యువీ క్రియేషన్స్‌తోపాటు సితార ఎంటర్టైన్మెంట్స్లో సినిమాలు చేస్తున్నానని అన్నారు.