»Mansoor Ali Khan Sues Megastar Chiranjeevi Kushubhoo And Trish
Mansoor Ali khan: మెగాస్టార్ చిరంజీవిపై మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా
విలన్ పాత్రలతో ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని మన్సూర్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పారు.
Mansoor Ali khan: విలన్ పాత్రలతో ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని మన్సూర్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పారు. నా గత చిత్రాలలో ఇతర నటీమణులతో చేసినట్లుగా ఆమెను బెడ్రూమ్కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను ఎందుకంటే నేను చాలా చిత్రాల్లో చాలా రేప్ సన్నివేశాలు చేశాను, ఇది నాకు కొత్త కాదు. కానీ కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో, ఈ కుర్రాళ్ళు సెట్స్‌లో కనీసం నాకు త్రిషను చూపించలేదు అంటూ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తనను చిరంజీవి ట్విట్టర్లో ఖండించారు.
దీనిపై మన్సూర్ అలీఖాన్ కూడా ఘాటుగా స్పందిస్తూ.. తన మాటలను అందరూ తప్పుగా తీసుకున్నారని, త్రిష, చిరంజీవిలపై కేసు పెడతానన్నారు. చిరంజీవి, త్రిషలపై మన్సూర్ అలీఖాన్ పరువు నష్టం దావా వేశారు. పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మద్రాస్ హైకోర్టులో దావా వేశారు. త్రిష, ఖుష్బూ, చిరంజీవి పరువు నష్టం దావా వేయాలంటూ లీగల్ లెటర్ విడుదల చేశారు. నేను వ్యక్తిగతంగా ఏ వ్యక్తులపై ఎలాంటి తప్పుడు ప్రకటన చేయలేదని, కానీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలపై వ్యాఖ్యానించానని, అది నెమ్మదిగా వేరే అర్థంతో వైరల్ అవుతుందని చెప్పాడు.