»Maheshs Latest Photos On Hello Magazine Are Viral
Mahesh babu: హలో మ్యాగజైన్ పై మహేష్ తాజా ఫోటోలు వైరల్
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గ్లామర్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే కాదు అంతర్జాతీయ గ్లామర్ మార్కెట్లను కూడా అబ్బురపరుస్తున్నారు. తాజాగా వరల్డ్ ఫేమస్ అయిన హలో మ్యాగజైన్ మహేష్ స్టైలిష్ ఫోటోలను ప్రచురించింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Mahesh babu: వెండితెర ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh babu) గ్లామర్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. తాజాగా అంతర్జాతీయంగా పేరుగాంచిన హలో మ్యాగజైన్(Hello Magazine) ఆయన స్టైలిష్ ఫొటోలను ప్రచురించింది. వివిధ పోజుల్లో ఉన్న మహేష్ బాబు హలో మ్యాగజైన్ పై ఆకట్టుకున్నారు. హలో వరల్డ్ అంటూ మహేష్ బాబు ఈ మ్యాగజైన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్స్ రచ్చ చేస్తున్నాయి.
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) కాంబినేషన్లో గుంటూరు కారం(Gunturukaram) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మీనాక్షి చౌదరి, శ్రీలీల మహేష్ సరసన నటిస్తున్నారు. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నారు. అందుకోసం ప్రత్యేక కసరత్తులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.