దర్శక ధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని మాత్రమే తెలుసు. అలాగే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఓ క్రేజీ అప్టేట్ ఒకటి బయటికొచ్చింది. గతంలో బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రూపొందించి.. ఇండియన్ సినిమా రూపు రేఖల్నే మార్చేశాడు రాజమౌళి. అప్పటి నుంచి మరిన్ని సీక్వెల్స్ ఊపందుకున్నాయి. కథకు స్కోప్ ఎక్కువగా ఉంటే.. రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు మేకర్స్.
ప్రస్తుతం పుష్ప2తో పాటు ఇంకొన్ని సినిమాల సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు ప్రాజెక్ట్ కూడా.. రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కథ ప్రకారం ఒకే పార్ట్‌లో ఈ సినిమాను కంప్లీట్ చేయడం సాధ్యమయ్యేలా లేదట. అందుకే పార్ట్ 2 ప్లానింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్‌కు అంతకు మించిన పండగ మరోటి లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో.. అసలు నిజముందా లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం. ఇకపోతే.. ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ సమ్మర్లో మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీతో పాటు.. ఓ స్టార్ హీరోని విలన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.