సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార (Sitara) మరోసారి మానవత్వం చాటుకున్నారు.హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా పండుగ సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి నమ్రత (Namrata),సితార హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు పేద వృద్ధులు, మహిళలకు వివిధ బహుమతులు అందించారు. ఈ కానుకలు అందుకోవడానికి స్టేజిపైకి రావడానికి ఓ వృద్ధురాలు (old woman) ఇబ్బంది పడగా సితార వెంటనే స్పందించింది.స్టేజి దిగి ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. ఆ తర్వాత వారితో కలిసిపోయి నవ్వుతూ ఫొటోలు దిగింది.
ఈ ఘటనను మహేశ్ అభిమాని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. గతంలో గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మహేశ్ బాబు (Mahesh Babu) కూడా ఇలాగే ఓ మహిళకు సాయమందించారు. ఆ వీడియోతో కలిపి సితార వీడియోను పోస్ట్ చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. పేదలు, వృద్ధుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం అనేది ఘట్టమనేని రక్తంలోనే ఉందని మరో అభిమాని కామెంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు (Netizens) సితారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.పెద్దల పట్ల గౌరవం చూపించే సందర్భాల్లో హోదాలు, అంతస్తులు గుర్తురావని సితార తన చేష్టలతో చూపించారు.