విజయ్ దేవరకొండ, సమంతా కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ఖుషి. ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చకున్నప్పటికి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చూస్తే మాత్రం పర్లేదు అనిపిస్తుంది. మరి ఎన్ని కోట్లు వచ్చాయో ఇప్పుడు చుద్దాం. వీరి కెరియర్లో బెస్ట్ ఓపనింగ్స్గా ఈ చిత్రం నిలిచింది.
Kushi: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంతా(Samantha ) జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఖుషి(Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట విడుదలైన అన్ని చోట్ల డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక సాయంత్రానికి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ రావడంతో విజయ్ అభిమానులు రిలీఫ్ అయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ చిత్రం..ప్రేమ, పెళ్లి తరువాత ఎదుర్కొనే సవాళ్లను ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినిమా పాటలు, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోంది. అందుకనే విజయ్ కెరియర్ సెకండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. మొదటి స్థానంలో లైగర్ చిత్రం ఉంది. ఇక ఖుషి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనతో మొదటి రోజు ఈ సినిమా పాన్ ఇండియా భాషల నుంచి దాదాపు 12 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిందని తెలుస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల నుంచి రూ. 17 కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ విప్లవ్‌గా ఆరాధ్యగా సమంతా నటించారు. సచిన్ ఖేడేకర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రం వీకెండ్లో అలరించినా లాంగ్ రన్లో ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి మరి. ఇక ఈ మూవీకి బడ్జెట్ 50 కోట్ల రూపాయలు అయినట్లు తెలుస్తోంది.