kushboo : చిరంజీవితో అలా చేయాలని ఉందన్న సీనియర్ నటి ఖుష్బు
తొలుత తెలుగు సినిమాతో పరిచయమై సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు ఖుష్బు. అందం అంటే ఖుష్బుదే అని అభిమానుల చేత అనిపించుకున్నారు. అందుకు ప్రతీకగా తనకు గుడి కూడా కట్టి దేవతగా కొలుస్తున్నారు.
kushboo : తొలుత తెలుగు సినిమాతో పరిచయమై సౌతిండియా(South india)లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు ఖుష్బు(kushboo). అందం అంటే ఖుష్బుదే అని అభిమానుల చేత అనిపించుకున్నారు. అందుకు ప్రతీకగా తనకు గుడి(Temple) కూడా కట్టి దేవతగా కొలుస్తున్నారు. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని… ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. దాదాపు దశాబ్దం పాటు కోలీవుడ్(Kollywood) లోనెంబర్ వన్ హీరోయిన్ గా ఖుష్బూ కొనసాగారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం రామబాణం(RamaBanam) రిలీజ్ కు రెడీగా ఉంది. రామబాణం సినిమా గోపీంచంద్(Gopi Chand) హీరోగా.. శ్రీవాసు దర్శకత్వం వహించారు. ఈమూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. ఈ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఖుష్బు. ఈసందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి ఖుష్బు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో మళ్ళీ.. రొమాన్స్(Romance) చేయాలన్న తన కోర్కెను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” చిరు నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది. ఆయన ఒక లెజెండ్. మానవత్వం కలిగిన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది. చేసే పని మీద ఫ్యాషన్ కూడా ఆయనకు ఎక్కువే. ఆయన ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అంతేకాదు నేను మెగాస్టార్ ను కదా ఏం చేసినా జనాలు చూస్తారని అనుకోరు. కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇప్పటివరకు పూర్తి కాని నా కల ఏదైనా ఉంది అంటే అది చిరంజీవితో రొమాన్స్ చేయలేకపోవటమే. స్టాలిన్(Stalin)లో కలిసి నటించాను కానీ అందులో నాది సిస్టర్ రోల్. మళ్ళీ ఆయనతో కలిసి పని చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నా. మెచ్యూర్ లవ్‌స్టోరీ(Lovestory), ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల’’ అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.