»Lucknow And Chennai Match Canceled Due To Rain One Point Each Team
IPL 2023: వర్షం కారణంగా లక్నో, చెన్నై మ్యాచ్ రద్దు..చెరో పాయింట్
లక్నో సూపర్ జెయింట్స్(LSG), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య పూర్తి కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొదట ఆటకు దిగిన లక్నో 125 రన్స్ చేసింది. ఇక చివరి ఓవర్ ఉండగానే వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో ఆటను నిలిపేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్(LSG), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య బుధవారం పూర్తికావాల్సిన 45వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ వచ్చింది. అయితే ఎకనా స్టేడియంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో.. ఆటకు ఆటంకం ఏర్పడింది. దీంతో మ్యాచును ఆపేశారు.
ఇక ఆతిథ్య జట్టు లక్నో 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆ క్రమంలోనే వర్షం తీవ్రత ఎక్కవ కావడంతో మ్యాచ్ నిలిపివేశారు. CSK ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు ఓవర్లు కూడా ఆడేందుకు సాధ్యం కాలేదు.
LSG మిడి లార్డర్ బ్యాటర్ ఆయుష్ బడోని 59 (33 బంతుల్లో 2×4, 4×6) పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక మిగతా ఆటగాళ్లు మరి పేలవంగా ఆడారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మొయిన్ అలీ (2/13), మహేశ్ తీక్షణ (2/37) వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. అంతేకాదు అవుట్‌ఫీల్డ్ తడి కారణంగా మ్యాచ్ సైతం 15 నిమిషాల ఆలస్యంంగా ప్రారంభమైంది.