Kiccha Sudeep 46th Movie Teasure Release Of 1st Sept Mid Night
Kichcha Sudeepa: డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల అభిమానం సంపాదించారు కిచ్చా సుదీప్ (Kichcha Sudeepa). కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగు, తమిళంలో కూడా అభిమానులు ఉన్నారు. హీరోగానే కాకుండా విలన్, ప్రత్యేక పాత్రలు చేసి.. తనకంటూ ప్రత్యేకతను చాటారు. వచ్చే నెల 2వ తేదీన సుదీప్ బర్త్ డే సందర్భంగా 46వ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో కిచ్చా 46 పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ మేరకు నిర్మాత కలైపులి ఎస్ థాను కూడా ట్వీట్ చేశారు.
సుదీప్ (Kichcha Sudeepa) 46వ మూవీని ద వీ క్రియేషన్స్ అండ్ కిచ్చాక్రియెట్లిన్ నిర్మిస్తోంది. సినిమాను విజయ్ కార్తికేయ తెరకెక్కిస్తారు. 1వ తేదీ రాత్రి 12.01 గంటలకు మూవీ టీజర్ విడుదల చేస్తారు. ఈ మేరకు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. దాంతో కిచ్చా 46 పేరు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. సుదీప్ (Kichcha Sudeepa) ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ.. షేర్ చేయడంతో ట్రెండ్ అవుతోంది.
టీజర్లో మూవీకి సంబంధించిన ఇతర వివరాలు.. నటీనటులు, టెక్నికల్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫీ తదితర విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆ ట్వీట్‌కు ఫ్యాన్స్ రీ ట్వీట్ చేస్తున్నారు. రా..రా.. రక్కమ్మ పాటను ప్రస్తావిస్తూ.. డార్లింగ్ అని ట్వీట్ చేస్తున్నారు. సో.. సుదీప్ (Kichcha Sudeepa) 46వ మూవీ ట్రెండింగ్ టాపిక్‌లో ఉంది.