»Karnataka Assembly Elections Kannada Stars Kiccha Sudeep Darshan Thoogudeepa Likely To Joins In Bjp
Karnatakaలో ఎన్నికల జిమ్మిక్కు.. హీరోల వెంట పడ్డ బీజేపీ
అవినీతి ప్రభుత్వమైన బీజేపీని సాగనంపేందుకు కన్నడ ప్రజలు చూస్తున్నారని తేలింది. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయనున్నారని సమాచారం.
కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) ముద్రపడిన కర్ణాటకలోని బీజేపీ మళ్లీ అధికారంలోకి (Power) రావడం కష్టంగా ఉంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో (Elections) ఓటర్లు తమకు వ్యతిరేక తీర్పును ఇస్తారని భయపడిన బీజేపీ జిమ్మిక్కు రాజకీయాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సినీ తారలను (Movie Stars) రాజకీయాల్లోకి తీసుకువస్తుంది. ఎన్నికల వేళ స్టార్ హీరోలను తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నది. సినీ పరిశ్రమ వారిని రాజకీయాలకు వాడుకోవాలని కమలం పార్టీ చూస్తున్నది. ఈ క్రమంలోనే కన్నడలో స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep), చాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీప (Darshan Thoogudeepa) తదితరులను పార్టీలోకి ఆహ్వానించింది.
లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటకలో (Karnataka) జరుగుతున్న ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా (Challenging) తీసుకుంది. చావోరేవోగా భావిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో సరికొత్త రాజకీయానికి తెరలేపింది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ వారిని రాజకీయాలకు వాడుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే స్వతంత్ర ఎంపీ సుమలత (Sumalatha) మద్దతును కూడగట్టింది. ఇక కన్నడ పరిశ్రమలో స్టార్లుగా కిచ్చా సుదీప్, తూగదీపను పార్టీలో చేర్చుకోనుంది. వారిద్దరికీ కర్ణాటకలో మాస్ ఫాలోయింగ్ (Following) ఉంది. లక్షల సంఖ్యలో ఆ హీరోలకు అభిమానులు ఉన్నారు. దీంతో వారి ఫ్యాన్ ఫాలోయింగ్, వారి అభిమానులను పార్టీ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తున్నది. అందుకే పార్టీలోకి ఆహ్వానించింది. బెంగళూరులోని (Bengaluru) ఓ ప్రైవేటు హోటల్ లో సుదీప్, దర్శన్ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారట. దీనికి ముహూర్తం ఖరారైందని సమాచారం.
మే 10వ తేదీన ఒకే దశలో కన్నడ గడ్డపై ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయం సాధిస్తుందని అనేక సర్వేలు తెలిపాయి. లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. అవినీతి ప్రభుత్వమైన బీజేపీని సాగనంపేందుకు కన్నడ ప్రజలు చూస్తున్నారని తేలింది. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao) ప్రచారం చేయనున్నారని సమాచారం. తెలుగు ప్రజలు నివసించే పలు కన్నడ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. జేడీఎస్ పార్టీకి మద్దతుగా కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పని చేయనుంది.