కియారా అద్వానీ పేరుకు బాలీవుడ్ హీరోయినే అయినా, టాలీవుడ్ జనాలకు పరిచయమే. మహేష్ 'భరత్ అనే నేను' సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంటనే 'వినయ విధేయ రామ'లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాల్లో వరుసగా ఛాన్సులు దక్కించుకోవడంతో టాలీవుడ్ లో పాగా వేసినట్లే అని అందరూ అనుకున్నారు.
‘వినయ విధేయ రామ’ ప్లాప్ తో కియారా అద్వానీ టాలీవుడ్ లో మళ్లీ కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాపై కియారాతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. మూవీకి శంకర్ దర్శకత్వం అనడంతోనే అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ పొలిటికల్ డ్రామాగా ఈ కథ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా పాత్ర ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ కూడా ఎక్కువగా ఉంది.
ఇక కియారా తాను షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ అంతే చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మల్టీ కలర్ డ్రెస్ లో మెరిసింది. పిష్ కట్ ఫ్రాక్ లో కనిపించి అదరహో అనిపించింది. ఆమె అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం ఆమె బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంపాటు ప్రేమించుకున్నారు. ఇటీవల కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.