మాసివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ మూవీతో సాలిడ్ కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్ అప్టేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళ తంబీలు. కార్తితో ఖైదీ.. విజయ్‌తో మాస్టర్.. కమల్ హాసన్‌తో విక్రమ్.. సినిమాలు తీసి బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. దాంతో ప్రస్తుతం స్టార్ హీరోలందరి చూపు లోకేష్ పైనే ఉంది. కానీ ఇప్పటికే ఈ మాసివ్ డైరెక్టర్‌కు క్రేజీ లైనప్ ఉంది. విక్రమ్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ఆ తర్వాత ఖైదీ సీక్వెల్.. విక్రమ్ సీక్వెల్ లైన్లో ఉన్నాయి. అలాగే రామ్ చరణ్‌తో ఓ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో టాక్. అయితే ప్రస్తుతం విజయ్ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు లోకేష్.
విజయ్ లేటెస్ ఫిల్మ్ ‘వారసుడు’ అయిపోగానే.. లోకేష్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నాడు. దాంతో ప్రజెంట్ లోకేష్ కనగరాజ్ టీం లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ డాగ్ ఎపిసోడ్ ఉండనుందని.. అది సినిమాకే హైలెట్‌గా నిలవనుందని తెలుస్తోంది. అందుకే సరైన లొకేషన్ కోసం వెతుకున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్.. హాట్ బ్యూటీ సమంత పేర్లు వినిపిస్తున్నాయి. కీర్తి విజయ్ భార్యగా కాస్త తక్కువ లెన్త్‌తో ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించనుందని టాక్. ఇక సమంత కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయనుందని తెలుస్తోంది. గతంలో కీర్తి నటించిన మహానటి మూవీలో సమంత కీలక పాత్రలో నటించింది. ఇక మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటించనున్నారని చెప్పొచ్చు. అలాగే విజయ్‌తో పలు హిట్ చిత్రాల్లో నటించింది సమంత. దాంతో ఈ క్రేజీ కాంబో ఆసక్తికరంగా మారంది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.