Keerthy Suresh: తెగేసి చెప్పిన కీర్తి సురేష్.. లిప్ లాక్ అతనితోనే!
మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందానికి, అభినయానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కీర్తి లవ్ మ్యాటర్ మాత్రం తేలడం లేదు. చాలా రోజులుగా కీర్తి ఫలానా వ్యక్తితో లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతునే ఉంది. పెళ్లి వార్తలు కూడా వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. కీర్తి లిప్ లాక్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది.
మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్(Keerthy Suresh).. రీసెంట్గా దసరా సినిమాలో వెన్నెలగా అదరగొట్టేసింది. కానీ మహానటి సినిమా తర్వాత.. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వెనకబడిపోయింది. అయితే మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాటలో కీర్తి కాస్త గ్లామర్ డోస్ పెంచేసి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి కీర్తి హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. మూవీ మేకర్స్‌కు దేనికైనా రెడీ అన్నట్టుగా హింట్ ఇస్తునే ఉంది. మరి కీర్తి ఇంతగా ఊరిస్తే.. మనోళ్లు ఊరుకుంటారా. అందుకే ఆమెనే డైరెక్ట్‌గా అడిగేస్తున్నారట. మా సినిమాలో గ్లామర్ షో చేయాలని.. లిప్ లాక్కు ఇవ్వలనీ అప్రోచ్ అవుతున్నారట.
కానీ దేని లెక్క దానికే అన్నట్టు.. ఇలాంటి పప్పులు తన దగ్గర ఉడకవని తెగేసి చెప్పిందట అమ్మడు. ఎంతలా అంటే.. లిప్ లాక్ ఇస్తే తనకు కాబోయే భర్తకే తప్పా.. ఏ హీరోకి కూడా ఇవ్వనని చెబుతోందట. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తప్పితే.. ఇండస్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి పెద్దగా ఎక్స్పోజ్ చేయలేదు కీర్తి(Keerthy Suresh). లిప్ లాక్ కూడా ఇవ్వలేదు. కానీ అమ్మడి హద్దు మీరబోతోందనే నమ్మకంతో.. కొత్త ప్రాజెక్టుల్లో లిప్ లాక్‌లు కావాలని అడుగుతున్నారట మేకర్స్.
కానీ అందుకు నో చెబుతోందట కీర్తి(Keerthy Suresh) పాప. క్యారెక్టర్ ఎంత డిమాండ్ చేసిన.. ఎంత ఆఫర్ చేసిన మొహమాటం లేకుండా కుదరదని చెబుతోందట. రీసెంట్గా ఓ కోలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ కథ డిమాండ్ మేరకు.. లిప్ లాక్ సీన్స్‌లో నటించాలని అడిగాడట. తను ఇలాంటివి అస్సలు చేయనని మొహం మీదే చెప్పేసిందట. అవసరమైతే.. సినిమా వదులుకుంటాను కానీ.. ముద్దు మాత్రం ఇచ్చేదేలే అని చెప్పిందట. దీంతో సదరు డైరెక్టర్ షాక్ అయ్యాడట. మరి నిజంగానే కీర్తి సినిమాల్లో లిప్ లాక్ చేయకుండానే.. రిటైర్మెంట్ తీసుకుంటుందేమో చూడాలి.