యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఆడియెన్స్‌ను బాగానే అలరించిన ఈ క్రైమ్ కామేడీ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో డైరెక్టర్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాదు.. అప్పుడప్పుడు నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో మెరిశాడు తరుణ్. ఇటీవలె తన స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన కీడా కోలా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రాగ్ మయూర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమాను తరుణ్ భాస్కర్ స్నేహితులు కె.వివేక్, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. నవంబర్ 3న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయిన మూవీ లవర్స్.. కీడాకోలా ఓటిటి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు వారాల్లోనే డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిపోయింది కీడా కోలా. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ఆహా వారు దక్కించుకున్నారు.
దీంతో కీడాకోలా సినిమా డిసెంబర్ 29వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని అధికారంగా వెల్లడించింది. అయితే.. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఒక రోజు ముందుగా అంటే.. డిసెంబర్ 28న ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. నార్మల్ సబ్స్క్రైబర్లు మాత్రం డిసెంబర్ 29 నుంచి ఈ మూవీని ఆహా ఓటిటి చూడొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆహానే పేర్కొంది. మరి ఓటిటిలో కీడా కోలా ఎలా అలరిస్తుందో చూడాలి.