కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్టో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో కార్తి కూడా ఒకడు. అన్న సూర్యతో పాటు కార్తికి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల దీపావళి కానుకగా వచ్చిన ‘సర్దార్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తి. వాటర్ మాఫియా నేపథ్యంలో.. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరింది.
దాంతో నిర్మాతలు దర్శకుడికి కాస్ట్లీ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత కార్తి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. ఇటీవలె పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్‌తో సక్సెస్ అందుకున్న కార్తి.. నెక్ట్స్ ఇయర్ పార్ట్ టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే సర్దార్ సీక్వెల్ కూడా ప్రకటించాడు. ఇక మాసివ్ బ్లాక్ బస్టర్ ఖైదీ సీక్వెల్‌ను వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టేశాడు. రాజ మురుగన్ దర్శకత్వంలో కార్తి తన 25వ సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి ‘జపాన్’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికు జోడీగా అను ఇమాన్యూయేల్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో మంచి హిట్ అందుకుంది అను. ఇక జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ‘జపాన్’ చిత్రం.. చెన్నైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.