junior ntr press meet on tarakaratna health status
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి అభిమానులకు తెలిపారు. ఇవాళ ఉదయమే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను పరామర్శించిన అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 27 వ తారీఖున మా కుటుంబంలో దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మెరుగైన వైద్యం అన్నకు ఇవ్వడం జరుగుతోంది. మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు, ఆత్మ బలం, మనో బలంతో పాటు అభిమానుల, తాత గారి ఆశీర్వాదం ఉంది. ఎంతో మంది ఆశీర్వాదం ఉంది. ఆయన త్వరగా కోలుకొని మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. మీ ప్రేయర్స్ కూడా కావాలి. మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. ఈ సిచ్యుయేషన్ లో సుధాకర్ గారు కర్ణాటక హెల్త్ మినిస్టర్ చాలా సాయం చేశారు. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. నాకు ఎంతో ఆప్తులు.. అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు తొందరగా కోలుకొని మనందరి ముందు రావాలని మీరందరూ ఆదేవుడిని ప్రార్థించాలని నేను కోరుకుంటున్నా అని కళ్యాణ్ రామ్ చెప్పారు.