Japan telugu trailer: సరికొత్తగా కార్తీ..జపాన్ ట్రైలర్ అదుర్స్
రాజు మురుగన్ దర్శకత్వం వహించిన 25వ చిత్రం జపాన్(japan). ఈ మూవీలో తమిళ్ హీరో కార్తీ యాక్ట్ చేయగా..నిన్న రాత్రి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ ఎలా ఉంది? టీజర్ ను మించిపోయిందా లేదా అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
తమిళ్ హీరో కార్తీ(karthi) యాక్ట్ చేసిన తాజా చిత్రం జపాన్(japan). ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ దీని అంచనాలను పెంచగా..తాజాగా ట్రైలర్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియో ఓపెన్ చేస్తే పెద్ద సముద్రాన్ని చూపిస్తారనే డైలాగ్ తో మొదలవుతుంది. ఆ క్రమంలో హీరో తన తల్లి కోసం 10 ఏళ్ల వయస్సులో దోపిడీ చేయడం ప్రారంభించాడని చెబుతాడు. ఆ నేపథ్యంలోనే అతను మోస్ట్ వాంటెడ్ దొంగగా ఎలా మారడనే విషయాన్ని ప్రస్తావిస్తాడు.
ఆ తర్వాత కార్తీ(karthi) ఓ ప్రత్యేకమైన దొంగతనంతో పాపులర్ అవుతాడు. ఒక మంత్రి నివాసంలో 200 కోట్ల రూపాయల పెద్ద దోపిడీ జరుగగా..అందులో జపాన్ ప్రధాన నిందితుడిగా ఉంటాడు. ఆ నేపథ్యంలో దురదృష్టవశాత్తు, హీరో ఒక పెద్ద దోపిడీ, హత్య కేసులో ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత పోలీసులు, విలన్ల చేజింగ్ సీన్లు, ఫైట్స్ ఉన్నాయి. అయితే ఆ నేరాలు చేసింది ఎవరు ? హీరోనే చేసాడా లేదా అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ పూర్తిగా వినోదాత్మక పాత్రలో కనిపించాడు. అంతేకాదు అతని కామిక్ టైమింగ్ కూడా నవ్వులు తెప్పించింది. దీంతోపాటు కార్తీ ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. అను ఇమ్మాన్యుయేల్(anu emmanuel) కథానాయికగా నటించింది. సునీల్(sunil), విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జపాన్ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.