యంగ్ హీరో రాజ్ తరుణ్ పై జబర్దస్త్ అప్పారావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అప్పారావు, రాజ్ తరుణ్ పై ఎందుకు కామెంట్స్ చేశాడు? అసలు ఏం మాట్లాడాడు? అనేది ఓ సారి చూస్తే..!
Jabardasth Apparao comments on hero Raj Tarun are viral
Hero Raj Tarun: షార్ట్ ఫిల్మ్ చేసి హీరోగా టాలీవుడ్లో సెటిల్ అయిపోయాడు రాజ్ తరుణ్. కెరీర్ స్టార్టింగ్లో మంచి సినిమాలే చేసిన ఈ హీరో.. అసలు ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడా? లేదా? అనే పరిస్థితికి వచ్చాడు. అయినా కూడా రాజ్ తరుణ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. రాజ్ తరుణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘తిరగబడరా సామీ’. ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని.. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామానాయడు స్టూడియోలో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
చదవండి: Media రంగంలోకి మంత్రి మల్లారెడ్డి.. సినిమాలు కూడా తీస్తారట..?
చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. జబర్దస్త్ అప్పారావు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఈ చిత్రంలో తాను మటన్ మస్తాన్ అనే పాత్రలో నటిస్తున్నానని.. ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాని.. ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదని అన్నాడు. అలాగే.. రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రా మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగురేసుకుపోతాడని.. కామెంట్స్ చేశాడు. ఇక నిర్మాత మల్కాపురం శివకుమార్ మరిన్ని సినిమాలు చేయాలని అన్నారు.
చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తిరగబడరసామీ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్.. యాక్షన్ కామెడీ రొమాన్స్ ఎక్కడా తగ్గకుండా ఉంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ కొడతాడేమో చూడాలి.