తాజాగా సమంత (Samantha) జిమ్‌లో ఓ వ్యక్తితో కలిసి వ్యాయామం చేస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ పిక్ అందరిలో లేని పోని అనుమానాలు కలిగిస్తుంది. వ్యక్తి ఫేస్ కనిపించకుండా సమంత పిక్ షేర్ చేయడంతో అతను తప్పకుండా ఆమె న్యూ బాయ్‌ఫ్రెండ్ (Boyfriend) అయి ఉంటాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈమధ్య సమంత దూకుడు పెంచింది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరస మూవీలు, వెబ్ సిరీస్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ మధ్యకాలంలో సమంత తరచూ ఓ వ్యక్తితో ఉన్న ఫొటోస్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
అంతే కాకుండా సామ్ కూడా అతనితో చాలా క్లోస్‌గా ఉంటుంది.ఇక ఆ ఫొటోస్(Photos)ను చూసిన కొందరు,సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది అతని గురించే ముచ్చటిస్తున్నారు. కొందరేమో.. వాళ్లిద్దరి మధ్య ఉన్న చనువు చూస్తే వీరు ప్రేమలో ఉన్నారేమో, సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అతడే అంటూ అభిప్రాయ పడుతున్నారు. మరి సమంత దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. సమంత రెండో పెళ్లి (Second marriage) చేసుకోబోయే వ్యక్తి ఇతనే అని, నాగ చైతన్యని మించి ఉన్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత షేర్ చేసిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే సమంత పక్కన ఉన్న మిస్టరీ వ్యక్తి ఎవరో మనకు తెలియాలంటే సమంత స్పందించాల్సిందే.
నాగ చైతన్య నుండి విడిపోయిన సమంత రెండేళ్లుగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. హీరో నాగ చైతన్య(Naga Chaitanya)తో విడిపోయాక తన ఫోకస్ మాత్రం కెరీర్‌పైనే పెట్టింది. మళ్లీ ఎవరిని వివాహం (Marriage) చేసుకోని సమంత.. సీక్రెట్‌గా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి.వాటిని పలు సందర్భాలలో సామ్ కొట్టి పడేసింది. ఇక సమంత-నాగ చైతన్య 2018లో ప్రేమ వివాహం చేసుకోగా, నాలుగేళ్ళ వైవాహిక జీవితం (married life) అనంతరం మనస్పర్థల వలన విడిపోయారు. 2021 అక్టోబర్ 2న తామిద్దరం అధికారికంగా విడిపోవాలని భావిస్తున్నామని చెబుతూ డైవర్స్(Divers) ప్రకటన చేశారు. వారి విడాకుల విషయం చాలా మంది హృదయాలని గాయపరచింది.