టాలీవుడ్లో వచ్చిన మహాసముద్రం సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలో నటించిన సిద్ధార్థ్, అదితి రావు ప్రేమలో పడ్డారని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అను ఇమ్మన్యుయేల్తో పాటు మరో హీరోయిన్గా అదితి రావు కూడా నటించింది. టాలీవుడ్లో అదితి రావు సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ నటించింది. తను ఎక్కువగా బాలీవుడ్లో నటించింది.
తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది కానీ.. తనకు అక్కడ అనుకున్నంత గుర్తింపు రాలేదు. మహాసముద్రం సినిమాతో సిద్ధార్థ్, అదితిరావు మధ్య ప్రేమ చిగురించినట్టు చెబుతున్నారు. ఇద్దరూ ఈ మధ్య బాగా క్లోజ్ అయ్యారట. ఇటీవల శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా ఇద్దరూ కలిసి వచ్చారు. దీంతో వీళ్ల మధ్య ఏముందో అరోజు బయటపడింది. మీడియాలో వచ్చే పుకార్లలో ఎంతో కొంత నిజం ఉంది అని సినీ అభిమానులు కూడా అనుకున్నారు.
నిజానికి అదితి రావుకు ఇదివరకే పెళ్లయింది. సిద్ధార్థ్‌కు కూడా ఇదివరకే పెళ్లయింది. ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చి ఇప్పుడు సింగిల్‌గా ఉంటున్నారు. ముంబైలో ఈజంట ఆ మధ్య మీడియా కంట పడ్డారు. అలాగే.. సిద్ధార్థ్ ప్రస్తుతం ఓ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని శర్వానందే అన్‌స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే సిద్ధార్థ్, అదితిరావు వాళ్ల రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అవడం లేదు కానీ.. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇద్దరూ పెళ్లికి సిద్ధం అవుతున్నారట. ఇదివరకే చేసుకున్న పెళ్లిళ్లు తమకు కలిసి రాలేదని.. అందుకే ఇద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వాలని తమ సన్నిహితులకు చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లి కూడా ఫిక్స్ చేసుకొని అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. అయితే.. అధికారికంగా తాము పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటిస్తారా? లేక.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంటారా? వేదిక ఎక్కడ.. అనే విషయాలు తెలియాలంటే అదితి రావు లేదంటే సిద్ధార్థ్ నోరు విప్పాల్సిందే.