Bhola Shankar: కలకత్తలో సీన్ ఓపెన్ అవుతుంది. అమ్మావారి విగ్రహం, హౌరా బ్రిడ్జ్, ఫోర్ట్ లను చూపిస్తారు. జాతర జరిగే సీన్లో ఒక అమ్మాయికి ఇంజన్స్ పొడిచి తనను ఒక పూల బుట్టలో కిడ్నాప్ చేస్తారు కొత్త మంది రౌడీలు. ఆ అమ్మాయి తండ్రి తన బిడ్డకోసం వెతుకుతుంటాడు. కంగారుపడుతుంటారు. ఆ పూల బుట్ట ఒక వ్యాన్ లో ఎక్కిస్తారు వ్యాన్ వెళ్లిపోతుంది. అక్కడికి పోలీసులు వస్తారు. పాప కనిపించడం లేదని తల్లదండ్రులు ఏడుస్తుంటారు. మా కాలనీ వాళ్లే, నేనే మీకు ఫోన్ చేసింది అని రఘు, బ్రహ్మాజితో చెప్తాడు. తమ పాపకు 17 ఏళ్లని, మూడు గంటల నుంచి కనిపించడం లేదని తండ్రి ఏడుస్తు పోలీసులకు చెప్తాడు. అంతలో లేడీ పోలీసుకు ఇన్ఫర్మెషన్ వస్తుంది. హౌరా బ్రిడ్జ్ దగ్గర మరో అమ్మాయి మిస్సింగ్ అని చెప్తుంది. మీరు వెంటనే కాలిఘట్ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి అని పోలీసులు అక్కడి నుంచి వెళ్లి పోతారు.
చదవండి:Allu Arjun Trivikram: పార్ట్ 2 ఫార్ములా ఫాలో అవుతున్న బన్నీ!
టైటిల్స్ పడుతుంటాయి మరో అమ్మాయికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేస్తారు. అలా కలకత్తా అంతా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు. వారికి పోలీసుల సపోర్ట్ కూడా ఉంటుంది. అలా కిడ్నాప్ చేసిన అమ్మాయిలను ఒక చోట తీసుకెళ్లి అబ్యూస్ చేస్తుంటారు. కట్ చేస్తే సముద్రం మధ్యలో ఒక షిప్ పై హెలిక్యాప్టర్ ల్యాండ్ అవుతుంది. అందులోంచి అలగ్జేండర్ మెయిన్ విలన్ దిగుతాడు. అతని వెనుకాలే గ్యాంగ్ అంతా నడుచుకుంటు అమ్మాయిలు ఉన్న చోటుకు వస్తారు. అక్కడ ఒక దుబాయ్ షేక్ ఉంటాడు. అతను అమ్మాయిని చూపించి డీల్ మాట్లాడుకుంటారు. అమ్మాయిలకు తీసుకొని వెళ్తారు.
కట్ చేస్తే పోలీస్ కిమిషనర్ షియాజీ శిండే పొలీసులు మీద అరుస్తుంటాడు. ఇన్ని కిడ్నాప్ లు జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా సేవ్ చేయలేకపోయాము అని అంటాడు. ఇప్పటి వరకు నో లీడ్స్, నో ఇన్ఫార్మర్, నో క్లూ అని అంటుండగా ఫోన్ వస్తుంది. దాన్ని లిఫ్ట్ చేసి ఒకే సర్ నేను చూసుకుంటా అని ఫోన్ పెట్టేస్తాడు.
కట్ చేస్తే ఫోలీసు స్టేషన్ ముందు తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చేస్తారు. పోలీసులను నిలదీస్తారు. హోం మినిస్టర్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అని ఒక స్పెషల్ ఆఫీసర్ ను అపాయింట్ చేశారని వారికి షియాజి శిండే చెబుతారు.
తరువాతి సీన్లో దుబాయ్ లో చార్లేస్ కు బ్రహ్మాజీ ఫోన్ చేసి తనకు డైమెండ్స్ కావాలని బదులుగా రేపు రైడ్ జరగబోతుందని ఇన్ఫార్మ్ చేస్తాడు.
నెక్ట్స్ డే అక్కడ స్పెషల్ ఆఫీసర్లు సెర్చ్ చేస్తారు. అక్కడ ఏమి దోరకదు. పైగా వచ్చిన ఆఫీసర్స్ ఆ మాఫియాకు దొరికిపోతారు. ఒక ఆఫీసర్ ను షిప్ లో బంధిస్తారు. అమ్మాయిలతో బిజినెస్ చెయ్యడం తప్పు అని ఆఫీసర్ సుబ్బరాజు చెప్తాడు. దానికి నేను చేసేది జస్ట్ బిజినెస్ కాదు ఇది ఒక ఎంపయర్ అని దీన్ని ఆపే దమ్మున్నోడు ఇంకా పుట్టలేదని చెప్పి.. అలాంటిన్ని పుట్టించమని పైకెళ్లి ఆ కాళిక మాతకు చెప్పు అని సుబ్బరాజును చంపేస్తాడు. అప్పుడే మెగస్టార్ చిరంజీవి తో పాటు భోళా శంకర్ టైటిల్ పడుతుంది.
కట్ చేస్తే కలకత్తాలో జాతరా జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మీ భయ్య వస్తాడన్నవ్ ఏక్కడ అని గెటప్ శ్రీను ను రఘు అడుగుతుండగా.. అల్రెడీ శంకర్ అన్న కలకత్తలోకి ఎంటర్ అయ్యాడు.. అదిగో.. అమ్మవారు అన్నగారు ఇకే సారి ఎంటర్ అయ్యారు అనే డైలాగ్ మీదుగా ఒక వాహనం ఆగుతుంది. రెండు కాళ్లు నెలమీద దూకుతాయి. అంతలో ఒక పోల్ కు షార్ట్ సర్క్యూట్ అయి కరెంట్ తీగా జెయింట్ వీల్లర్ మీదుగా వెల్తుంటే.. త్రిషులం తీసుకొని కరెంట్ తీగను ఒక గోడ వైపుకు విసరడంతో చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. అమ్మావారికి శంకర్ మొక్కతుండగా అందరు వచ్చి శంకర్ కు ధన్యవాదాలు చెబుతారు. అంతలో తన చెల్లి మహా కీర్తి సురేష్ ఎంట్రీ ఇస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో స్టేపుల్ వేస్తారు.
కట్ చేస్తే రఘు ఒక ఇల్లును చూపిస్తారు. అక్కడి నుంచి హౌరా బ్రిడ్జ్ చాలా అందంగా కనిపిస్తుంది. మహా ఒక ఆర్టిస్ట్.. బొమ్మలు చాలా బాగ వేస్తుంది. అందులో మాస్టర్ చేయడానికి కలకత్తా వస్తారు. ఇక ట్యాక్స్ డ్రైవర్ గా శకంర్ కు పని చూస్తాడు రఘు.
నెక్ట్స్ సీన్ లో కాలేజీకి శంకర్, మహా ఇద్దరు వెళ్తారు. అక్కడ ప్రిన్సిపల్ మేడమ్ మీటింగ్ లో ఉందని వారు బయట వేయిట్ చేస్తారు. బయటనుంచే ఆ ప్రిన్సిపల్ మేడమ్ డ్రాయింగ్ ను వేస్తుంది మహా. తరువాత తనకు సీటు ఇవ్వలేనని, ఇట్స్ టూ లేట్ అని చెప్పడంతో మహా చేతులో ఉన్న ప్రిన్సిపల్ బొమ్మను మేడమ్ కు చూపిస్తాడు శంకర్. దాంతో వేరీ ట్యాలెంటెడ్ అని పొగుడుతుంది. సీటు ఇచ్చేస్తుంది.
కట్ చేస్తే శంకర్ ట్యాక్సీ కంపెనీకి ఉద్యోగం కోసం వెళ్తారు. అక్కడి ట్యాక్సీ ఓనర్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడికి వంశీ (వెన్నల కిశోర్) వస్తాడు. అతడు ట్యాక్సీ ఓనర్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని కంపెనీకి ఓనర్ అయిన విషయాన్ని రఘు శంకర్ కు వివరిస్తాడు. బెంగాళిలో అందరూ అతన్ని బంశీ అని పిలవడం అతనికి నచ్చదు. దాంతో శంకర్ అతన్ని వంశీ అని పిలువడంతో కిశోర్ ఫ్లాట్ అయిపోతాడు. వంశీకి తన వైఫ్ అంటే ఇష్టం ఉండదు. కాని తనతో స్వీట్ గా మాట్లాడుతాడు. నెక్ట్స్ శంకర్ ను కొన్ని ప్రశ్నలు అడిగి శంకర్ కు ఉద్యోగం ఇస్తాడు. శంకర్ చాలా అమయకుడు అనుకుంటారు. కొబ్బరికాయ కొట్టి డ్యూటీ ఎక్కుతాడు శంకర్. అక్కడే లాయర్ లాస్య తమన్నా ఎంట్రీ ఇస్తుంది. తన కారు బ్రేక్ డౌన్ అవడంతో శంకర్ ట్యాక్సీ ఎక్కుతుంది. హడావిడీగా కోర్టుకు వెళ్లమని చెబుతుంది.
కోర్టు దగ్గర ఆపగానే డబ్బులు ఇవ్వకుండా తన అసిస్టెంట్స్ ఆది, వైవా హర్షాతో దొంగ సాక్ష్యం గురించి మాట్లాడుకుంటూ.. ఎలాగైనా ఈ కేసుకు మనమే గెలువాలి అనుకుంటు వెళ్తుంది. అక్కడ సెక్యూరుటీ శంకర్ ను వెళ్లమని చెబుతాడు. సాక్షి ఎక్కడ అంటే అతను జబర్దస్త్ రాజమౌళి తాగి ఊగుతుంటాడు. అక్కడికి జడ్జ్ బ్రహ్మనందం ఎంట్రీ ఉంటుంది. లాస్య టేకప్ చేసిన అన్ని కేసులు ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేస్తాడు జడ్జీ. ఇప్పుడు సాక్షి ఎలా అని చూస్తుంటే.. అదే సమయంలో డబ్బుల కోసం వచ్చిన శంకర్ ను ఎంపిక చేసుకుంటారు. డబ్బుల కోసం వచ్చిన శంకర్ ను సాక్ష్యం చెప్పమని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఫ్యామిలీని కాపడలంటే ఏం అయినా చేస్తా అంటాడు శంకర్. బెంగాలి భాషా రాదు అంటే చట్టానికి కళ్లు లేవు నీకు నోరు లేదని అతన్ని మూగవాడిగా కోర్టుకు పరిచయం చేస్తుంది. బోనులో మూగవాడిగా యాక్టింగ్ చేస్తాడు శంకర్. కేసు గెలిచే ముందు శంకర్ కు ఫోన్ చేస్తుంది మహా. దాంతో అతను ముగవాడు కాదని తెలిసి కేసు మళ్లీ ఓడిపోతుంది.
కట్ చేస్తే కాలనీలో దుర్గపూజా ఉందని రఘు శంకర్ కు ఫోన్ చేస్తాడు. కొట్టర కొట్టు తీన్ మార్ సాంగ్ స్టార్ట్ అవుతుంది..
పాట అయిన తరువాత శ్రీకర్(సుశాంత్) ఎయిర్ పోర్ట్ లో ఎంట్రీ ఇస్తాడు. అతడు దుబాయ్ లో పైలెట్. క్యాబ్ కోసం పిలువగా శంకర్ వచ్చి అతని లగేజీ కార్లో పెట్టేసి శ్రీకర్ ను ఎక్కించుకొని వెళ్తుండగా.. కాలేజీ అయిపోందని పిక్ చేసుకోమని మహా శంకర్ కు ఫోన్ చేస్తుంది. దాంతో ప్యాసింజర్ శ్రీకర్ పర్మిషన్ తో మహాను కూడా ఎక్కించుకుంటాడు శంకర్. తొలిచూపులోనే మహాను చూసి సుశాంత్ ఫ్లాట్ అవుతాడు. కారులో ఇద్దరికి పరిచయం ఏర్పడుతుంది. మహా ఆర్టిస్ట్ అని తెలుసుకుంటాడు. తనను పొగుడుతుంటాడు. అంతలో సుశాంత్ ఇంటికి వెళ్లి అతన్ని దిగబెట్టి వస్తారు.
శ్రీకర్ అమ్మానాన్నలు తనకు పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అతను లాయర్ లాస్య సిస్టర్ అని తెలుస్తుంది. శంకర్ మూలంగా తాను 3 సంవత్సరాలు సస్పెండ్ అయినందుకు శంకర్ పై కోపం పెంచుకుంటుంది లాస్య.
నెక్ట్స్ సీన్లో ట్యాక్సీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ తో పోలీసులు మీటింగ్ పెడుతారు. వారందరికి అమ్మాయిలతో పెద్ద సెక్స్ రాకెట్ నడుతుపుతున్నారని అందుకు కారణం ముగ్గురు బ్రదర్స్ అని, వారి పేర్లను బ్రెట్లీ, చార్లెస్, అలెగ్జాండర్ ఈ ముగ్గురు న్యూటోరియస్ మాఫియా అని చెప్తాడు. ఈ గ్యాంగ్ తో లింక్ ఉన్న 20 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు వారి ఫోటోలను అందరికి ఇస్తారు. పోలీసులు కన్న ఎక్కువగా మీరే సిటీలో తిరుగుతారని ఇన్ఫార్మేషన్ ఇచ్చిన వారి డిటైల్స్ సీక్రెట్ గా ఉంచుతామని, మనీ రివార్డ్ కూడా ఇస్తామని చెప్తాడు. ఆ మీటింగ్ లో శంకర్ కూడా ఉంటారు. మంచి పని చేస్తున్నప్పుడు రివార్డులు, అవార్డులు అవసరమా.. ఈ గ్యాంగ్ లో ఎవరు కనిపించినా తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తాడు. దానికి పక్కనే ఉన్న వంశీ మనకు అవసరమా అంటాడు. ఈ సిటీలో సినిమా పోస్టర్ల కన్నా ఎక్కువగా అమ్మాయిల మిస్సింగ్ పోస్టర్లే ఉన్నాయని శంకర్ అంటాడు. అది పెద్ద మాఫియా అని వంశీ వారిస్తాడు. ఎదుటువారికి సాయపడటానికి నేను ఎనుకముందు చూడను అని శంకర్ అంటాడు.
కట్ చేస్తే ఒక ముగ్గురు వ్యక్తులు వంశి, శంకర్ వెళ్తున్న కారును ఆపుతారు. వాళ్లకు వంశి బొమ్మ చూపించడానికి వెళ్తాడు శంకర్. ఇక సీన్లో ఏదైన ఆపదవస్తే తన బొమ్మ చూపిస్తే చాలు అంటాడు వంశి. అయితే వచ్చింది లాస్య తన జూనియర్స్. తన వల్లే లాస్య ఉద్యోగం పోయిందని శంకర్ ను కొడుతా అంటారు. వంశి అడ్డుపడుతాడు. వాల్లతో కామెడీ గొడవ. ఆ గొడవ నుంచి కాపాడినందుకు వంశీకు శంకర్ థ్యాంక్స్ చెబుతూ జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదోటి చేసి నీ రుణం తీర్చుకుంటా అని మాటిస్తాడు.
నెక్ట్స్ సీన్లో మహా, గుడిలో ప్రదక్షణాలు చేస్తుంటే శ్రీకర్ ఫాలో అవుతాడు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది. నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం పట్టించుకోవచ్చుగా అని మహాను అంటు వెనుకాలే వెళ్తాడు. మహా వెళ్లిపోయిందని వెనక్కి తిరగగానే శంకర్ ఇదంతా చూస్తుంటాడు. విషయం తెలుసుకున్న శ్రీకర్ కంగారు పడుతాడు. దగ్గరికెల్లి తనను ప్రేమించిన విషయం చెప్తాడు. దానికి ఈ విషయం మహాకు చెప్పారా అని.. ఇష్టపడితే ధైర్యంగా అమ్మాయిలకు చెప్పాలని, వారు ఔనన్నా కాదన్నా వారి అభిప్రాయాన్ని గౌరవించాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శంకర్.
కట్ చేస్తే పోలీసులు ఇచ్చిన 20 మందిలో ఒకర్ని చూసి శంకర్ ఫాలో అవుతాడు. అదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడు. దాంతో అక్కడికి పోలీసులు వచ్చి ఫైరింగ్ చేస్తారు. ఫస్ట్ టైమ్ ఒక క్రిమినల్ ప్లాన్ ను కలకత్తా పోలీసులు ఛేదించారని ఒక కామెన్ మ్యాన్ ఇచ్చిన ఇన్ఫార్మేషన్ మూలంగానే ఇది సాధ్యం అయిందని చెప్తాడు.
ఆ ఇన్ఫర్మార్ ఎవరని చార్లెస్ తన తమ్ముడు బ్రెట్లీకి ఫోన్ చేస్తాడు. 48 గంటల్లో ఆ ఇన్ఫార్మర్ ను చంపాలని చెప్తాడు.
నెక్ట్స్ సీన్ లో వంశి, శంకర్ ఇద్దరు కారులో వెళ్తుంటారు. వంశి ఒక పబ్ కు వెళ్తాడు. అక్కడ అమ్మాయిలతో చిందులేస్తాడు. వంశీ గెటప్ చూసి శంకర్ షాక్ అవుతాడు. అక్కడికి వంశి వైఫ్ వస్తుంది. అతన్ని తన మామ, వైఫ్ ఇద్దరు కలిసి చితక్కోడుతారు. అక్కడికి శంకర్ వస్తాడు. శంకరే ఇక్కడికి తన వైఫ్ ను పిలిచిన విషయం చెప్తాడు. అంతలో మహా ఫోన్ చేయడంతో వస్తున్న అని వెళ్లిపోతాడు.
కట్ చేస్తే బ్రెట్లీకి ఇన్ఫార్మర్ శంకర్ అని అతని మొబైల్ కు శంకర్ ఫోటో వస్తుంది. అతన్ని తీసుకురా అని తన మనుషులకు చెప్తాడు. కట్ చేస్తే శంకర్ ను కిడ్నాప్ చేస్తారు. శంకర్ ను ఒక షిప్ లోకి తీసుకెళ్తారు. అతన్ని చంపి పోలీస్ ఇన్ఫార్మర్ అని బోర్డు వేసి హౌరా బ్రిడ్జ్ కు హ్యాంగ్ చేయండి అని తన మనుషులకు చెప్తాడు బ్రెట్లీ. కింద వాల్లను కొట్టి షిష్ పైకి వెళ్లి బ్రెట్లీ మనుషులను అందరిని గన్ తో కాల్చేస్తాడు. రాడుతో కొడుతాడు. రాడ్ డోర్ కు పెట్టి అక్కడ ఉన్న మిగితా విలన్లందరిని చితక్కొడుతాడు. నానాబీభత్సం సృష్టిస్తాడు. చాలా స్టైల్ గా శంకర్ ఫైట్ చేస్తాడు. బ్రెట్లీ భయపడిపోతాడు. అసులు నువ్వు ఎవడురా రా ఏజెంట్, ఇంటర్ పోల్, సిబీఐ అని అడగ్గా అండర్ కవర్ కిల్లర్ అని శంకర్ సమాధానం ఇస్తాడు. ఎవరు పంపించారు అని అడగ్గా.. ఒకడు పంపిస్తే కాదురా నేను వెతుక్కుంటూ వచ్చానన్ని పోలీస్ బ్రహ్మాజీ ఫోన్లో నుంచి తన ఫోటో తానే పంపించుకున్నట్లు శంకర్ చెబుతాడు. నిన్ను నీ పైవాన్ని, ఆ పైవాన్ని అందరిని పైకి పంపిస్తా అని బ్రెట్లీని చంపేస్తాడు. ఆ టైమ్ లో శంకర్ కు మహా ఫోన్ చేస్తుంది. తనతో మాట్లాడుతాడు.
కట్ చేస్తే శంకర్ ఇంటికి వస్తాడు. తన బీరువా తెరిచి అందులో గన్ పెడుతాడు. అప్పటికే అందులో కొన్ని గన్ లు బుల్లెట్లు ఉంటాయి.
నెక్ట్స్ సీల్లో చార్లెస్ కలకత్తాకు వస్తాడు. అతని తమ్ముడి డెడ్ బాడీని ని చూస్తాడు. తన తమ్ముడితో సహా 30 మందిని అతి క్రూరంగా చంపినట్లు బ్రహ్మజీ చెప్తాడు. తన అన్న అలెగ్జెండర్ ఫోన్ చేస్తే బ్రెట్లీ చనిపోయిన విషయాన్ని దాచిపెడుతాడు. నెక్ట్స్ సీన్లో క్రైమ్ జరిగిన చోటుకు వెళ్తాడు. ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తాడు ఇది ఎవరు చేశారు అని అరుస్తాడు. చేసింది ఎవరు అని ఆలోచిస్తాడు.
ఆ కిల్లర్ ప్లానింగ్ తో కాదు కసితో, పగతో చంపాడు అని చార్లెస్ అంచనా వేస్తాడు. తన గట్ ఫీలింగ్ కరెక్ట్ అయితే తన నెక్ట్స్ టార్గెట్ తానే అని చార్లెస్ అంటాడు. అక్కడ ఒక షిప్ ఉందని అందులో ఏదైన క్లూ దొరకవచ్చు అని అంటాడు.
తరువాత సీన్లో శ్రీకర్ అమ్మనాన్నలు వచ్చి మహాను అడగడానికి వస్తారు. అప్పుడు శంకర్ తో మాట్లాడుతారు. ఇద్దరికి ఇష్టమే అన్న విషయంతో శ్రీకర్ లాస్యతో తన లవ్ సక్సెస్ అని చెప్తాడు. కాని లాస్య తన కెరియర్ పోయిందని ఫ్రస్టెట్ అవుతుంది.
కట్ చేస్తే సీసీ టీవీ ఫుటేస్ తో బ్రహ్మాజీ, రాజా రవింద్ర ఇద్దరు చార్లెస్ దగ్గరకు వస్తారు. దాన్ని ప్లే చేసి చూస్తారు. కాని అందులో శంకర్ ముఖం కరెక్ట్ గా కనిపించదు. కాని అతను మహాతో ఫోన్ మాట్లాడిన విషయమే క్లూగా భావించి ఆ టైమ్ లో ఆ సెల్ టవర్ కు వచ్చిన కాల్ ఆధారంగా అతన్ని పట్టుకోవచ్చని చెప్తాడు.
మరో వైపు శంకర్, శ్రీకర్ ఫ్యామిలీలు నిశ్చితార్థం పనుల్లో ఉంటారు. అక్కడికి వంశి వస్తాడు. మళ్లీ వంశి డ్రైవర్ గా మారుతాడు. ఒక అరటి పండు తిని తొక్క అక్కడ పడేస్తాడు. అక్కడికి లాస్య వస్తుంది. వచ్చి మహాను పరిచయం చేసుకుంటుంది. మహాను ఆటపట్టిస్తుంది. ముహుర్తం టైమ్ అయిందని శంకర్ ను పిలవమని పంతులు చెబితే, నేను పిలుస్తా అని లాస్య బావగారు అనుకుంటు వెళ్లి అరటి పండు తొక్కమీద కాలేసి జారి శంకర్ ఒల్లో పడుతుంది. అప్పుడే వాళ్లు ఒకరినోకరు తిట్టుకుంటారు. అది తెలిసి ఎంగేజ్మెంట్ ఆపేయమంటుంది. అందరూ దాన్ని కమెడీలా తీసుకొని లాస్యను లైట్ తీసుకుంటారు. మీరంతా ఒకటే అని లాస్య వెళ్లిపోతుంది. లాస్య తన జూనియర్స్ కు తోడు వంశి కూడా కలుస్తాడు. అందరు కలసి ప్లాన్ చేస్తుంటారు. మహా శ్రీకర్ ల ఎంగేజ్మెంట్ అయిపోతుంది.
మరో సీన్లో చార్లెస్ అనుమానం వచ్చిన అందరిని చంపేస్తుంటాడు.
నెక్ట్స్ మహా శ్రీకర్ బయటకు వస్తారు. అక్కడికి లాస్య కూడా వస్తుంది. వాళ్లకు ఒక ట్రిప్ ప్లాన్ చేసిన అని వాళ్ల ఫోన్లు లాక్కొని శంకర్ కు ఫోన్ చేసి మహాను ఎవరో కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడుతుంది. దానికి శంకర్ చాలా కంగారు పడుతాడు. తీరా అక్కడికి వస్తే అది నాటకం అని తెలిసి శంకర్ కొప్పడుతాడు. అతనికున్న కోపంతో పక్కనే ఉన్న గొడను పగలగొడుతాడు. దాంతో లాస్య శంకర్ తో ప్రేమలో పడుతుంది. మిల్కీబ్యూటీ పాట వస్తుంది.
సాంగ్ అయిన తరువాత టవర్ ను అక్టివేట్ చేస్తారు. చార్లేస్ అక్కడికి వచ్చి ఫోన్ అక్టివేట్ అయితే కనిపెట్టోచ్చు అని హ్యాకర్ చెప్తాడు. అదే సమయంలో మహా, శంకర్ కు ఫోన్ చేస్తుంది. లాస్య తీసుకొని మాట్లాడుతుంది. ఒకవైపు జీపీఎస్ ట్రాక్ అవుతుంది. అతన్ని చేజ్ చేయమని తన మనుషులకు అందరికి చార్లెస్ చెప్తాడు. అంతలో హ్యాకర్ టెన్షన్ పడుతూ.. అతను మన వద్దకే వస్తున్నాడని చెబుతాడు. దాంతో అతన్ని పట్టుకోండి అని తన బాయ్స్ కు చెబుతాడు చార్లెస్. లిప్ట్ ఓపెన్ చేయగానే అందులో తన మనుషు చనిపోయి ఉంటారు. మనం వాడికోసం వెతుకుతున్నామ్.. వాడు మనల్ని వేటాడానికి వస్తున్నాడని అరుస్తాడు. వాన్ని వెతకండి అని గ్యాంగ్ కు చెబుతాడు. అక్కడ గ్లాస్ ను పగలగొట్టుకొని శంకర్ ఎంట్రీ ఇస్తాడు. గన్ లతో అందరిని కాల్చేస్తుంటాడు. గన్ లతో గుండాలను ఊచకోత కోస్తుంటాడు. వినుత్నమైన ఫీట్లో విలన్లను దూనం ఆడుతాడు శంకర్. తన ఫైటింగ్ నైపుణ్యంతో గ్యాంగ్ స్టర్లనే గడగడలాడిస్తాడు. బయపడి చార్లేస్ పారిపోతుంటే కత్తి పట్టి ఒక్కొక్కరి కుత్తుకలను తెగ నరుకుతాడు. చార్లెస్ తో ఫైట్ చేస్తాడు. అతన్ని కొడుతుంటే చార్లెస్ కు ఫోన్ వస్తుంది. దాన్ని లిఫ్ట్ చేసి అలెగ్జెండర్ తో మాట్లాడుతాడు. నీ మాఫియాను ఖతం చేస్తా అని అలగ్జెండర్ కు వార్నింగ్ ఇస్తాడు. చార్లెస్ తల నరుకే సమయానికి అక్కిడికి లాస్య వచ్చి షాక్ అవుతుంది. భయంతో పరుగుడెతుంటే తనను చూపులతో బెదిరిస్తాడు. నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. నువ్వు బ్రూటల్ క్రిమినల్ నీలాంటి అన్నయ్య ఉన్న మహాతో పెళ్లి జరగనియ్యను అని అంటుంది. అదే నీ కారణం అయితే ఆ అమ్మాయి నా చెల్లే కాదు అని చెబుతాడు శంకర్. ఇది ఇంటర్ వెల్ బ్యాంగ్.
కథ ఒక సంవత్సరం క్రితం హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. ప్లాష్ బ్యాక్..
భోళా బాయ్ కోసం ఒక పోలీస్ అరుస్తూ వస్తాడు. పోలీసులను ఆదుకోవాలని, ఒకడు పోలీసులకు బంధించినట్లు చెప్తాడు. పబ్లిక్ కు ప్రాబ్లమ్ వస్తే పోలీసుల దగ్గరకు పోతారు. అదే పోలీసులకు ప్రాబ్లమ్ వస్తే భోళా బాయ్ దగ్గరకు వస్తారు అని ఆ గ్యాంగ్ పోలీసులతో చెప్తుంటారు. ఏ మే రాజహా పాట బ్యాగ్రౌండ్ లో భోళా బాయ్ స్టైల్ గా నడుచుకుంటు వస్తాడు. జీప్ లో రయ్యుమంటు వెళ్లి అక్కడ కిల్లి నమిలి కామెడీ చేస్తాడు. కిల్లి పాప రెష్మీతో రొమాన్స్ చేస్తాడు. పోలీసులకు బెట్టింగ్ ఇచ్చిన విలన్ తన మనిషి పప్పిని పంపిస్తాడు. వాడు తాడి చెట్టంతా హైట్ ఉంటాడు. అతన్ని కొట్టి మిగితా వారితో ఫైట్ చేస్తాడు. ఫన్ని డైలాగులు, కామెడీ కొట్టుటు సరదాగా ఉంటుంది. ఫైట్ సాలిడ్ గా ఉంటుంది. పోలీసులను విడిపిస్తాడు. భోళా మేనియా సాంగ్ వస్తుంది.
సాంగ్ అయిపోతుంది. భోళా శంకర్ ను జీత్తు పొడిచేస్తాడు. అక్కడికి మహా వచ్చి అతనికి హెల్ప్ చేస్తుంది. శంకర్ వద్దాన్నా వినదు. ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అక్కడ అన్నయ్య అని చెప్పి ట్రీట్మెంట్ చేయిస్తుంది. శంకర్ కు ఓ పాజిటీవ్ బ్లెడ్ కావాలి అని నర్స్ చెప్పగానే నాది కూడా ఓ పాజిటీవ్ బ్లెడ్ అని అతనికి బ్లడ్ ఇస్తుంది. తనకు ఏం కాదని నర్స్ చెప్పగానే వెళ్లిపోతుంది.
నెక్ట్స్ సీన్లో శ్రీముఖి గారెలు తింటు ఉంటుంది. అక్కడికి తన ఫ్రెండ్ మహా వస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజీకి వెళ్లేసమయంలో అక్కడికి ఒక బిల్డర్ నర్సింగ్ గ్యాంగ్ వచ్చి మురళి శర్మకు దమ్కీ ఇస్తారు. ఇళ్లు అమ్మేయ్యమని పక్కనే షాపింగ్ పడుతుంది. ఈ ఇళ్లు పార్కింగ్ కోసం కావాలని బెదిరించి వాళ్లకు టైమ్ ఇచ్చి వెళ్లిపోతారు.
దానికి మహా పోలీసు కంప్లైంట్ ఇద్దాము అంటే, ఇలాంటి వాటికి పోలీసులు కాదు అని నిన్ను ఒకచోటుకు తీసుకెళ్తా అంటుంది. కట్ చేస్తే అది భోళాశంకర్, అక్కడున్న భోళా గ్యాంగ్ వాళ్లతో డీల్ మాట్లాడి భోళాతో మాట్లాడమని చెబుతారు. మహా తన సమస్య చెబుతుంది. కట్ చేస్తే భోళా మహా ఇంటికి వెళ్తాడు. ఇంటిని పరిచయం చేస్తారు. కుక్కతో జోకులు చేస్తున్న సమయంలో రౌడీలు వస్తారు. వారికి దమ్కీ ఇచ్చి పంపించేస్తాడు. దాంతో వచ్చిన రౌడీ బిల్డర్ నర్సింగ్ కు చెప్పడంతో.. భోళాకు ఫోన్ చేసి ఆ ఇళ్లు కావాలిని అడుగుతాడు. అది కుదరదు అని భోళా చెప్తాడు. పది లక్షలు ఇస్తా అనే సరికి భోళా ప్లేట్ మారుస్తాడు. వాళ్లతో ఇల్లు కాళీ చేయిస్తా అని ఒప్పందంతో మంచిగా నటించి, బోషనంలో ఉన్న డాక్యూమెంట్స్ ను కొట్టెయాలన ప్లాన్ చేస్తారు. తరువాత 4 కోట్ల ఇళ్లును పది లక్షలకే సెటిల్ అయిన విషయం తెలుసుకొని మళ్లీ బిల్డర్ నర్సింగ్ కు ఫోన్ చేసి డీల్ కోటికి మాట్లాడుకుంటారు. దాంతో ఇల్లు కాళీ చేయమని కామెడీగా బెదిరిస్తాడు. శ్రీముఖిని బెదిరిస్తాడు. వాళ్ల గ్యాంగ్ తో ఇంట్లోకి దిగిపోతాడు. తాగుతూ, పాటలు పాడుతూ ఎంజయ్ చేస్తాడు. తాగుడు మధ్యలో భోళా ఎమోషనల్ అవుతాడు. తనను కాపాడిన అమ్మాయిని తలుచుకొని ఎమోషనల్ గా డైలాగులు చెప్తాడు.
ఆ విషయాన్ని మహాలక్ష్మీ తన ఫ్రెండ్ వింటారు. శ్రీముఖి వాళ్లతో అంతా చేసింది మహా అని చెప్తుంది. దానికి వీళ్లు నాటడం ఆడుతున్నారని ఇద్దరిని బెదిరిస్తాడు భోళా. తరువాత సీన్లో మహాతో మురళిశర్మ ఆ బిల్డర్ నర్సింగ్ కన్న భోళా ఉంటేనే మనకు రక్షఅంటాడు. ఉదయమే లోబో బొమ్మను గీస్తుంది మహా. శ్రీముఖి తాళం చేవులు కొట్టేయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఖుషి నడుము సీన్ వస్తుంది. ఈ సీన్ తరువాత తాళం చేవులు నొక్కెద్దాం అనుకున్న ప్లాన్ రివర్స్ అవుతుంది. తరువాత సీన్లో గెటప్ శ్రీను, తనతో వచ్చిన గ్యాంగ్ అంతా మహా ఫ్యామిలీతో కలిపిపోతారు. అందరూ వారితో రకరకాల గెటప్ లో పద్దతగా మారి వారితోనే కలిసిపోతారు. మహా భోళా కాళ్లు పట్టుకుంటుంది. అయిన భోళా వినడు.
మరో సీన్లో బిల్డర్ నర్సింగ్ ఫోన్ చేసి ఆ డాక్యూమెంట్స్ మీద మహా సంతకం కావాలి అని చెప్తాడు. మహా కాలేజీకి వెళ్లిందన్న విషయం తెలుసుకొని భోళా అక్కడి వెళ్లేసరికి మహాను కొంత మంది గుండాలు కిడ్నాప్ చేస్తారు. వాళ్లు మహాను ఒక చోటుకు తీసుకెళ్తారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు. వాల్లను అలగ్జెండర్ గ్యాంగ్ అమ్మేయ్యాలని చూస్తారు. అంతలో అక్కడి భోళా శంకర్ వస్తాడు. వాళ్లతో ఫైట్ చేస్తాడు. శంకర్ ఫైట్ చేస్తుంటే మహా అక్కడున్న అమ్మాయిలను అందరిని కాపాడుతుంది. అక్కడున్న హార్డ్ డిస్క్ ను తీసుకుంటుంది. అమ్మాయిలందరిని భోళా సేవ్ చేస్తాడు.
మురళిశర్మ ఇంట్లో అందరు అమ్మాయిలతో ఎమోషనల్ సీన్ ఉంటుంది. అంత మందిని కాపాడినందుకు అందరూ భోళాకు థ్యాంక్స్ చెబుతారు. తరువాత సీన్లో డాక్యుమెంట్ల కోసం భోళా బిల్డర్ నర్సింగ్ దగ్గరకు వెళ్లి ఫైట్ చేసి బెదిరించి ఇంటి జోలికి రాకు అని పేపర్స్ తీసుకొని వస్తాడు.
నెక్ట్స్ సీన్లో మాఫియా బ్రెట్లీ గ్యాంగ్ వచ్చి హార్డ్ డిస్కి మిస్ అయిందని వెతుకుతారు. అక్కడున్న సీసీ కెమెరాలో మహా హర్డ్ డిస్క్ తీసుకున్నట్లు తెలుసుకుంటారు. కట్ చేస్తే మహా ఇంట్లోకి చార్లెస్ బ్రెట్లీ వెళ్లి మహా తల్లిని చంపెస్తారు. మహా, మురళిశర్మ ఇద్దరు పారిపోతుంటే చార్లెస్ మురళి శర్మను చంపెస్తారు. హర్డ్ డిస్క్ కోసం వస్తున్నారని మహా అక్కడినుంచి తప్పించుకుంటుంది. కాని బ్రెట్లీ మహాను కత్తితో పొడుస్తాడు. చార్లెస్ తలపై కొడుతాడు. అలా మహాను కొట్టి వెళ్లిపోతారు. అక్కడికి భోళా వస్తాడు. మహాను ఆ పరిస్థితుల్లో చూసి ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అక్కడే భోళాకు ఆరోజు రాత్రి తనను సేవ్ చేసింది మహా అనే విషయం తెలుస్తుంది. భోళా శంకర్ బాధపడుతాడు. మహాను వేరే ఆసుపత్రికి తరలిస్తారు. అపరేషన్ జరుగుతుంది. కాని తన గతం మొత్తం మరిచిపోయినట్లు డాక్టర్ చెప్తాడు.
అప్పడే మహా పానిక్ అవుతుంది అని నర్స్ చెప్తుంది. తాను ఎవరిని గుర్తుపట్టదు. కాని భోళాను గుర్తుపడుతుంది. తాను అన్నయ్యగా పరిచయం చేసుకుంటాడు. అలా భోళా తనను అన్నయ్యగా చూసుకుంటాడు.
మహాను ఈ స్థితికి తీసుకొచ్చినందుకు, ఇలాంటి రాకెట్ ను నడుపుతున్న మాఫియాను చంపాలన్న భోళా ఆశయాన్ని లాస్యకు చెప్తాడు. దాంతో లాస్య కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. కట్ చేస్తే అలగ్జెండర్ ఫ్లైట్ తన మనుషులతో దిగితాడు. తన ఇద్దరి తమ్ముళ్ల డెడ్ బాడీలను చూస్తాడు. డబ్బు కోసం జాబ్ రిస్క్ చేయగలం కాని ప్రాణాలు రిస్క్ చేయలేము అని రాజారవింద్ర అనేసరికి బ్రహ్మాజీ దగ్గర గన్ తీసుకొని రాజాను చంపెస్తాడు విలన్.
బ్రహ్మాజీ అలెగ్జండర్ కు ఒక విషయం చెప్తాడు. గ్యాంగ్ లో ఒకతను కోమాలో ఉన్నాడని అతను బయటకు వస్తే అసలు విషయం తెలుస్తుంది అని బ్రహ్మజీ చెప్తాడు. ఒక వైపు మహా శ్రీకర్ల సంగీత్ జరుగుతుంది. జామ్ జామ్ జజ్జనక్క సాంగ్ వస్తుంది.
సాంగ్ అయిపోగానే కోమాలో ఉన్న వ్యక్తికి సృహ వస్తుంది. కాని తాను ఎంత సేపు బతికి ఉంటాడో తెలియదని డాక్టర్ అంటాడు. వాడు పోయే లోపు వాళ్ల తమ్ముళ్లను చంపిన వాడి బొమ్మ గీయించాలని బ్రహ్మాజీ మహాకాలెజీ వెళ్తాడు. అక్కడ మహా మంచి ఆర్టిస్ట్ అని చెప్పడంతో తాను హెల్ప్ చేస్తా అంటుంది. అలా కోమాలో ఉన్న అతను చెప్పిన విధంగా మహా స్కెచ్ గీస్తుండగా.. శంకర్ మహాకు ఫోన్ చేస్తాడు. నాకు లోకేషన్ షేర్ చేయి నేను పికప్ చేసుకుంటాను అని చెప్తాడు. అతను చెప్తుంటాడు. మహా గీస్తుంది. ఫైనల్ గా గీయడం అయిపోగానే అది వాళ్ల అన్నయ్యది.
కిల్లర్ అతనే అని చెప్పి అతను చనిపోతాడు. తప్పు జరిగింది అని మహా చెప్తుంది. అతను మా అన్నయ్య అలాంటి వాడు కాదు అంటుంది. దానికి అలగ్జేండర్.. మీ అన్నయ్య వస్తున్నాడు కదా రానియ్యి అని మహాను అక్కడే కూర్చొబెడుతాడు. శంకర్ వస్తాడు. శంకర్ రాగానే అందరూ గన్స్ గరి పెడుతారు. ఒక్కసారిగా బ్రహ్మాజీ అలెగ్జేండర్ కు గన్ గురి పెడుతాడు. అక్కడితో శంకర్ మహాను తీసుకొని వెళ్లిపోతాడు.
నెక్ట్స్ సీన్లో మహాతో శ్రీకర్ ఫ్యామిలీ షాపింగ్ చేస్తుంటే అలగ్జేండర్ ఫోన్ చేస్తాడు. మహాను కిడ్నాప్ చేసిన విషయం చెప్తాడు. దాంతో శంకర్ కోపంతో అలగ్జేండర్ డెన్ కు వస్తాడు. అయితే శంకర్ కే తెలియకుండా అతని ట్యాక్సీలోనే మహాను తీసుకొస్తాడు. మహాను వేరే కారులో షిఫ్ట్ చేసి తీసుకెళ్తాడు. అక్కడ రౌడీలను కొట్టి ట్యాక్సీలో బయటకు వస్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆలోచిస్తుంటే.. డిక్కిలో ఉన్న మహా శంకర్ కు ఫోన్ చేస్తుంది. తాను చెప్పే క్లూస్ తో శంకర్ తనను వెతుక్కుంటూ అలగ్జండర్ ఉన్న చోటుకువెళ్తాడు.
చదవండి:Leo: పఠాన్, జవాన్ రికార్డులు బీట్ చేసిన ‘లియో’
అక్కడ క్లైమాక్స్ ఫైట్… మహాకు తలకు గాయం అవుతుంది. శంకర్ ను కొట్టి మహాను వేరే కారులో తీసుకెల్లిపోతారు. అప్పుడే కాళీ మాత ఉత్సవం జరుగుతుంది. మహాకు గతం గుర్తుకు వస్తుంది. భోళా అని గట్టిగా అరుస్తుంది. భోళా శంకర్ ఫైట్ చేస్తాడు. గుండాలను చీల్చి చెండాడుతాడు. అలెగ్జండర్ తో ఫైటింగ్ చేస్తాడు. మహా త్రిషులం విసురుతుంది. దాంతో అలేగ్జండర్ ను పొడిచేస్తాడు శంకర్. అప్పుడు రావాణాసురుడి బొమ్మ కాలుతుంది. ప్రెస్ మీట్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ను పట్టుకున్నట్లు పోలీసులు అందరికి చెప్తారు. వారిని చంపిన కిల్లర్ ఎవరు.. అందరు అతన్ని దేవుడిలా భావిస్తున్నారు అని ఒక రిపోర్టర్ అడుగుతాడు. భోళా శంకర్ కు సినిమాకు శుభం పడుతుంది.