‘కాంతార చాప్టర్-1’తో భారీ విజయం సాధించిన రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ చేశారు. 2016లో తన సినిమాను ఒక్క ఈవినింగ్ షో ప్రదర్శించేందుకు పడిన కష్టం నుంచి, ఇప్పుడు 5,000కు పైగా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపించే వరకు దర్శకుడిగా తన ప్రయాణం గుర్తు చేసుకున్నారు. ఈ విజయం దేవుడి దయ, ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని పేర్కొంన్నారు.