VSP: పద్మనాభం మండలం పొట్నూరు నుంచి రెడ్డిపల్లికి వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు కూలిపోయే స్థితికి చేరిందని స్థానికులు తెలిపారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. కల్వర్టు కూలితే రవాణాకు తిప్పలు తప్పవని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరతున్నారు.