Hero Vijay Leo movie First day advanced booking tickets record
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, లోకేశ్ కనగరాజ్ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లియో’. గ్యాంగ్‌స్టర్‌గా కథతో వస్తున్న ఈ సినిమాలో త్రిష ఎన్నో ఏళ్ల తర్వాత హీరోయిన్గా కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. వీరితో పాటు గౌతమ్ మేనన్, మిస్కిన్ వంటి టాప్ నటులు కూడా ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. తక్కువ సమయంలోనే ఎక్కువగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.
అక్టోబర్ 19న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. లియో సినిమా మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరుమీదున్నది. ఓవర్సీస్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. అక్కడ భారీగా టికెట్లు కొనుగోలు అయ్యాయి. విడుదలకు ముందే లియో సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. నెలముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల చేశారు. యూకేలో వీటిని భారీగా కొనుగోలు చేశారు. షారూఖ్ నటించిన పఠాన్, జవాన్ కంటే లియో సినిమా టికెట్స్ మొదటిరోజు భారీగా అమ్ముడయ్యాయి. ఫస్ట్‌డే షో కోసం 30,000 మంది ‘లియో’ టికెట్స్ కొనుగోలు చేశారని చిత్రయూనిట్ తెలిపింది. సినిమా రిలీజ్‌కు ముందే థియేటర్ల సంఖ్య ఇంకా పెంచే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ప్రకటించింది.