‘పుష్ప’ హిట్‌తో ‘పుష్ప 2’ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు బన్నీ-సుక్కు. పైగా కెజీయఫ్ 2 చూసి సుకుమార్ భారీ మార్పులు చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. అందుకే లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్టు.. బాక్సాఫీస్‌ను పుష్పరాజ్ షేక్ చేసేలా స్క్రిప్టు రెడీ చేశాడట సుకుమార్. అందుకు తగ్గట్టే 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్‌ను అక్టోబర్ 1న అల్లు వారి ఫిల్మ్ స్టూడియో ‘అల్లు స్టూడియోస్’ ఓపెనింగ్ రోజున ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ని అక్టోబర్ 10న మొదలు పెట్టనున్నట్టు టాక్. ఇక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత విదేశాల్లో షూట్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో.. మరోసారి కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం బన్నీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే బన్నీతో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా అట్లీకుమార్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా కథ ‘మనీ హైస్ట్’ వెబ్ సిరీస్ రేంజ్లో ఉంటుందని అంటున్నారు. ఈ మూవీని ప్రముఖ తమిళ ప్రొడక్షన్ కంపనీ లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనుందని టాక్. ఇక అట్లీతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తోను బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఇలాంటి వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.